మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 23 : మంచిర్యా ల పట్టణానికి రాముని చెరువు పార్కు తలమానికంగా నిలువనుంది. పార్కు అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం ప్రత్యేక చొర వ తీసుకుని.. రూ.3.50 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. టెండర్లు పూర్తవగా.. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. 2001 సంవత్సరంలో అప్పటి రెవెన్యూ అధికారులు 47 ఎకరాల రాముని చెరువు స్థలాన్ని మున్సిప ల్ అధికారులకు అప్పగించారు. ఆ సమయంలో చెరువు చుట్టూ కట్ట నిర్మించి, మొ క్కలు నాటి, ఫుట్పాత్ ఏర్పాటు చేసి, వి ద్యుద్దీపాలను అమర్చారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కును నిర్మించారు. కొద్ది రోజుల తర్వాత ఆలనాపాలనా మరువడం తో అభివృద్ధికి నోచుకోలేదు. మంచిర్యాల పట్టణవాసులు ఉల్లాసంగా గడుపడానికి ఒక్క పార్కు కూడా లేదని తెలుసుకున్న కలెక్టర్ 2018లో రాంచెరువు అభివృద్ధికి, సుం దరీకరణకు పరిపాలన అనుమతులు ఇచ్చా రు. ఇందుకోసం రూ.3.50 కోట్లు ఖర్చు చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు అధికారులు టెండరు ప్రక్రియను పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో పనులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
రాముని చెరువు పార్కులో రూ.3.50 కోట్లతో చేపట్టే పనులతో పార్కు రూపురేఖలు మారిపోతాయి. ఇందుకు ఎమ్మెల్యే దివాకర్రావుతోపాటు అధికారులు కృషిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో ఇప్పటికే చాలా పట్టణాలు బాగుపడ్డాయి. ఆయన ఆలోచనల మేరకు ప్రజలకు అవసరమైన పనులను పాలకవర్గం చేపడుతుంది.
– పెంట రాజయ్య, మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల