ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళుల ర్పించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి బుధవారం ఉదయం గిరిజనులు తరలివచ్చి స్తూపం వద్ద సంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, బాధితులతోపాటు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. అంతకముందు ఇంద్రాదేవికి పూజలు చేశారు. ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడిన తోడసం ఖట్టికి తుమ్మగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సమక ఎక్స్‌రోడ్డు వద్ద ఖట్టి స్మారకార్థం జెండాను ఆవిష్కరించారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 20 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, శ్రద్ధాంజలి ఘటించారు. అమరులను స్మరించుకున్నారు. రగల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ దినానికి ఉదయం పది గంటలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీ గిరిజనులు తరలివచ్చారు. ముందుగా స్తూపం నుంచి ఇంద్రాదేవి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.
అనంతరం స్తూపం వద్దకు చేరుకొని ఎరుపు రంగు జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీ గిరిజనులతోపాటు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతోపాటు కాల్పుల్లో గాయపడిన బాధితులు జంగుబాయి, మాన్కుబాయి స్వేచ్ఛగా నివాళుర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఉట్నూర్ సీఐ సైదారావ్, ఇంద్రవెల్లి ఎస్ఐ నాగ్నాథ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమరులకు ఘనంగా నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించిందని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. 41 ఏండ్ల క్రితం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సంఘటితమైన ఆదివాసులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2015 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల సంస్మరణ దినోత్సవంపై ఉన్న అంక్షలను ఎత్తివేసి నివాళులర్పించేందుకు స్వేచ్ఛ కల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలోనే ఆదివాసీ గిరిజనులకు సంపూర్ణ హక్కులు దక్కుతున్నాయ న్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అమరవీరులకు నివాళులర్పిం చేందుకు ఆదివాసులు రాకుండా అడ్డుకట్ట వేసి నిర్బంధాలు విధించేవారన్నారు. ఆయన వెంట ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ పాల్గొన్నారు.
– మాజీ ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్, మాజీ ఎంపీ నగేశ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఐటీడీఏ మాజీ పీవో కల్లి వీరమల్లు, సామాజిక సమరసతా రాష్ట్ర అధ్యక్షుడు అప్పల ప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు భుజంగ్‌రావ్, ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సుగుణ, కెస్లాపూర్ సర్పంచ్ రేణుకానాగ్‌నాథ్, జడ్పీటీసీలు ఆర్కా పుష్పలత, చంద్రకళ, గంగుబాయి, ఎంపీపీలు జైవంత్‌రావ్, అమృత్‌రావ్, ఎంపీటీసీ భీంరావ్, ఆదివాసీ గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు భీమ్రావ్, సార్మేడిలు వెంకట్రావ్పటేల్, జుగాదిరావ్, చిన్ను పటేల్, దుర్గు, మానవ తుడందెబ్బ సలహాదారు ఖమ్ము, రగల్ జెండా ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు నాగోరావ్, ప్రధాన కార్యదర్శి నాగ్నాథ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు నగేశ్, తుడుందెబ్బ మండలాధ్యక్షుడు భారత్, ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సమాజ్ మండల అధ్యక్షుడు రామ్‌దాస్, మాజీ ఎంపీపీ కనక తుకారామ్, మాజీ సర్పంచ్ సుంకట్రావ్, సర్పంచ్‌లు జుగాదిరావ్, కైలాస్, లక్ష్మణ్, షేకురావ్, ఆంధ్ ఆదివాసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు విష్ణు అమరులకు నివాళులర్పించారు.
ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాటాలు చేసి మృతిచెందిన తోడసం ఖట్టికి తుమ్మగూడకు చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో నివాళులర్పిం చారు. సమక ఎక్స్‌రోడ్డు వద్ద ఖట్టి స్మారకార్థం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ గిరిజనులు మాట్లాడారు. ఆదివాసీ గిరిజనుల కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారన్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఆరేండ్లు నిర్బంధంలో ఉన్నారన్నారు.