దస్తురాబాద్, ఏప్రిల్ 17 : గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టా యి. ఇది నిరుపేద కుటుంబాలకు వరంలా మా రింది. ఉపాధి పనులు మండలంలో ముమ్మ రం గా కొనసాగుతున్నాయి. ప్రసుతం వేసవికాలం కావడంతో పల్లెల్లో వ్యవసాయ పనులు అంతగా లేవు. దీంతో ఉపాధి హామీ పనుల వైపు కూలీలు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దిన సరి కూలి రూ.245లు చెల్లిస్తున్నది. ఏప్రిల్ నుంచి కూలీలకు దినసరి కూలి రూ.257లు చెల్లించను న్నారు. వేతనం పెంచడంతో నిరుపేద కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దస్తురాబాద్, దేవునిగూడెం, మల్లాపూర్, గొడిసెర్యాల, ఆకొండపేట, రేవోజిపేట గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. దీంతోపాటు అటవీ భూముల్లో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు కుంది. భూగర్భ జలాలు పెంచేందుకు ఉపాధి హమీ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కూలీలు ఉదయమే పనులకు వెళ్తున్నారు.
ప్రస్తుతం మండలంలో 4443 జాబ్ కార్డులు న్నాయి. 200 కు పైగా గ్రూపులు ఉండగా మొత్తం 9721 మంది కూలీలు ఉన్నారు. ఏప్రిల్లో దాదాపు 3000 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. అత్యధికంగా దస్తురాబాద్ గ్రామ పంచాయతీలో 410 మంది కూలీలు, అత్యల్పం గా భూత్కూర్ గ్రామ పంచాయతీలో 90 మంది కూలీలు పనులకు వస్తున్నారు. ప్రస్తుతం భూత్కూర్ గ్రామ పంచాయతీలో కూలీలు పాంపాండ్ నిర్మాణ పనులు చేస్తుండగా, మిగతా గ్రామాల్లో కందకాల నిర్మాణ పనులు పట్టారు.
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి పని కల్పిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్యదర్శుల వద్ద పనికి వచ్చే కూలీలు తమ పేర్లు, గ్రూప్ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి పనులు ముమ్మరం కావడంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పనులు చేసేటప్పుడు కూలీలు జాగ్రత్తలు పాటించాలి.
– వెంకటేశ్వర్లు, ఎంపీడీవో(దస్తురాబాద్)
సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత కొత్త జాబ్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం. అర్హులకు కార్డులు మంజూరు చేస్తాం. అడిగిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి కూలీలకు వేసవి భత్యం రూ. 257లకు పెరిగింది. పనికి తగ్గ కూలిని కూలీలకు చెల్లిస్తున్నాం. ప్రసుత్తం మండలంలో దాదాపు 3 వేల మంది వరకు కూలీలు పనులకు వస్తున్నారు. ఉపాధి హామీ నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నది.
– రవి ప్రసాద్,ఏపీవో(దస్తురాబాద్)