దేశవ్యాప్తంగా 2025 సంవత్సరం నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి హక్కుదారుడి హోదా కల్పించి ఈ-ప్రాపర్టీ కార్డు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వమిత్య(సర్వే ఆఫ్ విలేజ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) పేరిట పంచాయతీరాజ్ గ్రామీణ మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ నుంది. తెలంగాణలో మొదటగా ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాల్లో అమలు చేయనున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి(కె) గ్రామం కూడా ఉంది. ప్రతి ఇంటి యజమానికి ఈ కార్డు రావడంతో పలు రకాల ప్రయోజనాలు కలుగడమే కాకుండా.. ఆస్తుల వివాదాల వంటి సమస్యలు పరిష్కారం కానున్నాయి.
ఆదిలాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామాల్లో ఇంటి స్థలాల వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో ఏళ్లకాలం నుంచి కుటుంబ సభ్యులు స్థానికంగా నివిస్తుంటారు. మరికొందరు ఉపాధి, ఇతర అవసరాల కోసం పల్లెల్లో ఇళ్లను వదిలి పట్టణాలకు వెళ్తుంటారు. ప్రత్యేకించి గ్రామాల్లో తాతల కాలం నాటి ఇండ్లు ఉండటంతో భూమి సమస్యలు ఎక్కువగా ఉంటా యి. తమ ఇండ్ల నివాసాలు, హద్దులకు సంబంధించిన ఎలాంటి పత్రాలు ఉండవు. హద్దులకు సంబంధించి పక్కవాళ్లు, స్థానికులతో గొడవలు జ రుగుతుంటాయి.
యజమానుల వద్ద ఇండ్లకు రి జిస్ట్రేషన్ ధ్రువపత్రాలు ఉండకపోవడంతో ఈ ఆ స్తులపై బ్యాంకుల నుంచి అప్పులు సైతం దొరకని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమస్యల పరిష్కా రం కోసం కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణ మం త్రిత్వ శాఖ స్వమిత్య( సర్వే ఆఫ్ విలేజ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) పేరిట ఈ-ప్రాపర్టీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కార్డులో ఇంటి యజమానికి సంబంధించిన ఆస్తుల లెక్కలను పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకుంటారు.
ఈ-కార్డు పంపిణీ ప్రక్రియలో భాగంగా రా ష్ట్రంలో ఐదు గ్రామాలను వివిధ అంశాల్లో ఎంపిక చేయగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మం డలం అర్లి(కె) సైతం ఉంది. ఈ గ్రామంలో మొ త్తం జనాభా 912 ఉండగా 250 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటి ఆస్తిని పక్కాగా లెక్కించి యజమానికి హక్కు కల్పించే ప్రక్రియలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రైవేటు సం స్థకు సంబంధించిన సిబ్బంది గ్రామానికి వస్తారు. డ్రోన్లు, ఉపగ్రహం ద్వారా అన్ని ఇండ్లకు సం బంధించి సర్వే నిర్వహిస్తారు. గ్రామంలో ఇండ్లలో నివసించే వారి వివరాలను సేకరిస్తారు.
ఆస్తుల పంపకాల్లో భాగంగా అన్నదమ్ముల పంచాయితే ఉంటే ఎవరి హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో వారికి అడిగి నిర్ణయిస్తారు. అనంతరం అందరి అంగీకారంతో ఆ ఇంటి యజమానికి సంబంధించిన ఇళ్లు ఎంత స్థలంలో ఉందో ఖాళీ జాగా ఎంతో ఉందో లాంటి కొలతలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆధార్‌కార్డు మాదిరి ఈ-ప్రాపర్టీ కార్డు పంపిణీతో ఇంటి యజమానులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి.
ఇండ్లకు ధ్రువీకరణ పత్రాలు లేని వారికి కార్డు ఉపయోగపడనుంది. బ్యాంకుల్లో రుణాలు లభిం చే అవకాశాలు ఉండటంతో పాటు యజమాని తన భూమిని ఇతరులకు విక్రయించినప్పుడు కచ్చితమైన కొలతలు తెలియజేయవచ్చు. ఈ – ప్రాపర్టీ కార్డుకు సంబంధించిన ఉపయోగాలను పూర్తిస్థాయిలో వెలువరించే అవకాశాలున్నాయి.