ఆదిలాబాద్ టౌన్, మే 13 : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని జేడీఏ పుల్లయ్య సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లోకారి గ్రామంలో శుక్రవారం రైతులకు వానకాలం సాగుకు సన్నద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఒకే భూమిలో ఒకే పంటను సంవత్సరాల తరబడి సాగు చేయకుండా పంట మార్పిడి పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద కొనుగోలు చేసి రసీదు తీసుకొని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో మహ్మద్ అశ్రఫ్, ఏఈవో ఉమ పాల్గొన్నారు.
బోథ్, మే 13 : మండలంలోని కరత్వాడ గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి శ్యామ్ రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సింధు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
భీంపూర్, మే 13 : రైతులు వానకాలంలో నాణ్యమైన విత్తనాలు వేసుకోవాలని ఏఈవో శంకర్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మడివి లింబాజీ, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు రాథోడ్ ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, మే 13 : రైతులు పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఏఈవో సుధాకర్ అన్నారు. మండలంలోని మత్తడిగూడలో శుక్రవారం రైతులకు వానకాలం సన్నద్ధత, నకిలీ విత్తనాలపై అప్రమత్తత, వేసవి దుక్కులు, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎస్బీ వాడడం వలన నేల లోపల మొక్కకు లభ్యం కానీ స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయే విధంగా చేసి మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మే 13: వానకాలం సన్నద్ధత కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆందోలి గ్రామంలో ఏఈవో దేవేందర్ రైతులకు వ్యవసాయ పంటలు, విత్తనాలు, ఎరువులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మారుతి, రైతులు రాజేందర్, గోవింద్, పత్తుసింగ్, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, మే 13 : మండలంలోని వాంకిడి, లఖంపూర్, బుగ్గారం, కొర్టికల్, బొందిడి గ్రామాల్లో ఏఈవోలు రైతులకు వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవోలు సౌజన్య, సంకీర్తన, జైపాల్, అపర్ణ, గజేందర్, తదితరులు పాల్గొన్నారు.