ప్రైవేట్‌కు దీటుగా ఫలితాలు రాబట్టేందుకు రాష్ట్ర సర్కారు సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు, రివిజన్ క్లాసులు నిర్వహిస్తు న్నారు. కాగా, ఈ నెల 6న ప్రారంభమైన పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు.. 12న పూర్తయ్యా యి. రివిజన్ తరగతులను 13 నుంచి 21వ తేదీ వరకు తిరిగి కొనసాగి స్తున్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత శాతం కోసం కృషి చేస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. -మంచిర్యాల, మే 13 (నమస్తే తెలంగాణ)
ఈ నెల 23 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పదో తరగతి హాల్ టికెట్లు, ముద్రించిన నామినల్ రోల్స్ ఇప్పటికే స్కూళ్లకు చేరుకోగా, విద్యార్థులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు సూచించారు. హాల్ టికెట్లను సంబంధిత వెబ్ సైట్లోనూ పొందుపరిచారని, గురువారం నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రంలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాను చీఫ్ సూపరింటెండెంట్ గదిలో బిగించి, సీల్ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్ చేస్తున్నప్పుడు రికార్డు చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన కలెక్టర్లకు లేఖ రాశారు. పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల వినియోగంపై సూచనలు చేశారు. మంచిర్యాలలో పరీక్షల నిర్వహణకు గాను 58 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 58 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, నలుగురు అడిషనల్ కస్టోడియన్లు, 620 మంది ఇన్విజిలేటర్స్‌ను నియమించారు. ముగ్గురు ఫ్లయింగ్ స్కాడ్ సైతం పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు.
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకే పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నాం. అధికారుల ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు కెమెరాలను అద్దె, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తీసుకోవచ్చు. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా రివిజన్ తరగతులను కొనసాగిస్తున్నాం.
– ఎస్.వెంకటేశ్వర్లు, డీఈవో, మంచిర్యాల
సిరికొండ, మే 13 : ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కా నున్నాయి. దీంతో విద్యార్థులకు ఈ సమయం చాలా కీలకం. కష్టపడి చదివితే మంచి మార్కులు, గ్రేడింగ్ సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదు వుకు ఆటంకం కలుగకుండా సినిమాలు, టీవీలు, ఫోన్లు, కంప్యూటర్‌కు దూ రంగా ఉండి, పోషకాహారం తీసుకుంటే మంచి ఫలితాలు రావడం ఖాయం.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఆటలు, వినోదాలకు దూరంగా ఉండడమే మంచిది. ఉపాధ్యాయులు సూచించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా చదువుతూ ఆయా జవాబులపై పట్టు సాధించాలి. కొన్ని చిట్కాలు తప్పని సరిగా పాటించి ప్రణాళికతో క్రమం తప్పకుండా అభ్యసనం, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఒకరోజు ఒక సబ్జెక్టుపై టైం టేబుల్ చేసుకొని సిద్ధమైతే మంచిది.