గుడిహత్నూర్, మే 12 : విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రేవతి సూచించారు. గురువారం మండలంలోని వైజాపూర్ గ్రామంలో వానకాలం పంటల సాగు సమయాత్తంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలని సూచించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి రైతులు మీ సేవ కేంద్రంలో ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి లక్ష్మణ్, ఎస్ఐ ప్రవీణ్, ఏఈవో శ్రీధర్, ఏఎస్ఐ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, మే 12 : విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతుతు జాగ్రత్త వహించాలని గాదిగూడ వ్యవసాయ అధికారి జాడి దివ్య అన్నారు. గాదిగూడ మండలం చిత్తగూడ, కొలామా, శేడ్వాయి గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మాయమాటలతో నకిలీ విత్తనాలు, ఎరువులు అంటగట్టే ప్రయత్నాలు చేస్తారని, అలాంటి వారు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో, తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు, మే 12 : రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ అన్నారు. బరంపూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావ్య, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు శాస్త్రీ, తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, మే12: దళారుల మాటలు నమ్మిమోసపోకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏఈవో సంగీత అన్నారు. మండలంలోని పిప్పల్కోటిలో రైతులకు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అలాగే నిపాని, కరంజి(టీ) క్లస్టర్లలో ఏఈవోలు మహేశ్, వికాస్ రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు స్వాతిక, కల్యాణి, భూమన్న, నాయకులు నరేందర్యాదవ్, ఆకటి నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
బేల, మే 12: రైతులు వర్షాలు కురిశాకే విత్తనాలు నాటుకోవాలని ఏఈవోలు రాజు, కృష్ణవేణి, రమణ సూచించారు. మండలంలోని చప్రాల, మాంగ్రూడ్, సోన్ఖాస్ గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్, మే 12: రైతులు వానకాలంలో నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని ఏఈవో సౌందర్య సూచించారు. మండలంలోని కోర్ట, సిర్సన్న గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ల సర్పంచ్లు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.