భైంసా, ఏప్రిల్ 14 : దళితుల జీవితాల్లో కొత్త కాంతి కిరణం దళితబంధు అని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం 71 మంది లబ్ధిదారులకు దళితబంధు కింద ట్రాక్టర్లు, కార్లు, జేసీబీలు తదితర వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు దళితులకు అండగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ అందించిన ఈ సాయంతో దళిత కుటుంబాలు భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బామ్ని రాజన్న, లోలం శ్యాంసుందర్, తూం రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, తోట రాము, ప్రసన్నజిత్ ఆగ్రే, సదాశివ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తా. నాకు ట్రాక్టర్ మంజూరైంది. నేను డిగ్రీ వరకు చదువుకున్న. వ్యాపారం చేయాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామనుకున్న. ఆ సమయంలో మా ఊరు దళితబంధు కింద మొదటి విడుతగా ఎంపికైంది. నా కల నెరవేరనున్నది. సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– మహేశ్, లబ్ధిదారుడు, మాంజ్రి
నాకు డెయిరీ ఫాం మంజూరైంది. నేను ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటా. పాల వ్యాపారంలో కొంత అనుభవం ఉంది. అం దుకే డెయిరీ ఫాం తీసుకు న్నా. బోరు మోటారు తో పాటు షెడ్డు నిర్మాణం, 8 బర్రెలను ఒక యూనిట్‌గా అందజేస్తున్నారు. ఈ పథకంలో చాలా సౌలత్లు ఉన్నాయి. దళితుల కోసం ఇంత మం చి పథకం ఇచ్చిన సీఎం కేసీఆర్ సారు మేలు మరువలేం.