నిర్మల్ అర్బన్, మే 2 : ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ అనంతరం ఇంటర్ పరీక్షలు మొదటి సారిగా నిర్వహించడంతో పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు సంబంధించి ఇప్పటికే పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాలు పూర్తి కాగా ఈ నెల 6 నుంచి 28వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లాలో మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు పర్యటిస్తాయని, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థులను డిబార్ చేయడంతో పాటు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 15201 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా డీఐఈవో పరశురాంతో ‘నమస్తే
నమస్తే తెలంగాణ : ఇంటర్ పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు?
ఇంటర్ నోడల్ ఆఫీసర్ : ఇంటర్ పరీక్షలకు మొత్తం 15201 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్ 6207 మంది, ఒకేషనల్ 1133 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6374 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1172 మంది ప్రైవేట్‌గా 89 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించాం. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాలు నిర్వహించాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిబంధనలు జారీ చేశాం.
నిర్మల్ జిల్లాలోని ముథోల్, భైంసా, ఖానాపూర్‌లో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించాం. ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. నిత్యం ఈ కేంద్రాల్లో సిట్టింగ్ స్వాడ్లు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతో ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతాం.
జిల్లాలో మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. వారందరూ మాస్ కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షలకు వెళ్లేటప్పుడు శ్రద్ధగా పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల యాజమాన్యాలకు వివరించాం. ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాలు తనిఖీ చేశాం. పరీక్షలకు అనువుగా ఉన్న కేంద్రాలను మాత్రమే ఎంపిక చేశాం. వేసవి దృష్ట్యా ప్రతి కేంద్రంలోని తరగతి గది ఎంట్రన్స్‌లో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు, కూలర్లు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించాం. ఆరోగ్య సిబ్బందిని కూడా నియమించాం.
దిలావర్పూర్, లక్ష్మణచాంద, ఖానాపూర్, కడెంతో పాటు ఇతర సెల్ఫ్ సెంటర్లలో పరీక్షల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెల్ఫ్ సెంటర్లలో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
పరీక్షల సమయంలో ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని ఒత్తిడి చేస్తే, ఆ కళాశాలలపై విద్యార్థుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటాం. హాల్‌టికెట్ కోసం కళాశాలకు వెళ్లకుండా ప్రభుత్వం ఆన్లైన్లో ఉంచింది. tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు పేరు, పుట్టిన తేదీ ఆధారంగా తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.