
ఎమ్మెల్సీ కోటిరెడ్డి
తిరుమలగిరి సాగర్, జనవరి 30 : తన స్వగ్రామమైన మండలంలోని బోయగూడేన్ని జిల్లాలోనే అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచి పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తొలిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, కోలాట ప్రదర్శనలతో గ్రామం పొలిమేర నుంచి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక పాఠశాలలో ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ గ్రామంలో పుట్టినవాడిగా ఇక్కడి సమస్యలు తనకు తెలుసునన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు ఎమ్మెల్సీ కోటిరెడ్డిని ఘనంగా సన్మానించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడా జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్, జడ్పీటీసీ ఆంగోతు సూర్య భాష్యానాయక్, సర్పంచ్ నెమలి సునీతాకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఎస్ మండల కోఆర్డినేటర్ శాగం రాఘవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పుట్లూరు రాజశేఖర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జటావత్ జయరాంనాయక్, తహసీల్దార్లు మందడి నాగార్జున్‌రెడ్డి, నెమలి అంజిరెడ్డి, కేవీ.రామారావు, అల్లి పెద్దిరాజు నాగమణి, మన్నెం రంజిత్‌యాదవ్, చెన్ను సుందర్‌రెడ్డి, ఆవుల పురుషోత్తం, బొల్లేపల్లి రమణరాజు, దేశ్య బాలు, తెనాలి సాయిరాంరెడ్డి, కూన్‌రెడ్డి లింగారెడ్డి, శివశంకర్, మండలి శ్రీనివాస్‌యాదవ్, మెండె సైదయ్య, నెమలి మల్లారెడ్డి, పొదిల మల్లయ్య పాల్గొన్నారు.