
ఎమ్మెల్యే నోముల భగత్
హాలియా, జనవరి 30 : పేదింట్లో ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం ఇచ్చే తాంబూళమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 3,4,5,6,7,8 ,10,11వార్డుల్లో 18మంది లబ్ధిదారులకు ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా వార్డుల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. గత కాంగ్రెస్ పాలనలో తల్లిదండ్రులు ఆడపిల్లలను అమ్ముకుంటే ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలతో మా ఇంటి మహాలక్ష్మిగా దీవిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ఏడేండ్లుగా జనరంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి, కౌన్సిలర్లు అన్నేపాక శ్రీను, ప్రసాద్‌నాయక్, వర్రా వెంకట్‌రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, కోఆప్షన్ సభ్యులు చాపల సైదులు, డోమినిక్, రావుల లింగమ్మాలింగయ్య, అన్వరుద్దీన్, పట్టణ కమిటీ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, మండల ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, చేగొండి కృష్ణ, దోరేపల్లి వెంకటయ్య, కాట్నం నాగరాజు, అనిల్, రాంబాబు, రవి, చి న్నా, చెన్నయ్య పాల్గొన్నారు. హాలియాలో ఎమ్మెల్యే భగత్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.