
దళితబంధు సర్వే ప్రారంభించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డి, జనవరి 30 : ప్రభుత్వం దళితులను ధనికులు చేసేందుకు దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట మం డలం గొల్లగూడెం గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి 51 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బృహత్తరమైన కార్యక్రమాన్ని గొల్లగూడెంలో ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక చేయడం గ్రామస్తుల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. గ్రామంలో పార్టీలకతీతంగా అర్హులను గుర్తించి లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ పెట్టుకునేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌కుమార్, ఎంపీపీ యాదమ్మ, ఎంపీటీసీ సునీతాసుధాకర్, ఆర్డీవో మెంచు నగేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, మండల విద్యాధికారి అనిత, గ్రామస్తులు పాల్గొన్నారు.
దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి;మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ రూరల్, జనవరి 30 : దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. అదివారం మెదక్ మండలం వెంకటపూర్ పంచాయతీ పరిధిలోని కోంటూరులో దళితబంధుపై అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సర్వేను అదనపు కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ దళితబంధు పథకం ద్వా రా ఒక్కో దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందన్నారు. సమగ్ర సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం లో ఎంపీడీవో శ్రీరాములు, ఎంపీవో మౌనిక, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉపసర్పంచ్ నాగరాజు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి..
చిన్నశంకరంపేట, జనవరి 30 : దళితబంధు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించా రు. ఆదివారం మండల పరిధిలోని చందంపేటలో నిర్వహిస్తున్న దళితబంధు సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్ మా ట్లాడుతూ ప్రతి దళిత కుటుంబ వద్దకు వెళ్లి వారి వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, ఎంపీవో గిరిధర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీలత స్వామిరాజు పాల్గొన్నారు.