
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, జనవరి 30: ప్రతిఒక్కరూ గాంధీ ఆశయాలు కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని చింతల పేటలో ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. మహాత్మాగాంధీ శాంతి అహింసా మార్గంలో నడిచి దేశానికి స్వాంత్య్రం సంపాదించి పెట్టాడని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం అందించడంలో గాంధీ సేవలు మరువలేనివని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం అందరం పాటుపడుదామని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్,మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్,వార్డు కౌన్సిలర్ కృష్ణ,కౌన్సిలర్లు మురళి, నరహరి శ్రీనివాసులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోవిందు తదితరులు పాల్గొన్నారు.
ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే దంపతులు
జిల్లా కేంద్రంలోని పెద్ద అగ్రహారానికి వచ్చిన వాదిరాజ పీఠాధిపతులు విశ్వవల్లభ తీర్థ శ్రీపాదులను ఆదివారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జ్యోతి దంపతులు కలిసి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు స్వామివారిని పూలమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయ్‌కుమార్, ఎంపీటీసీ ఆనంద్, మధుమతి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
జోగుళాంబ గద్వాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండల పీఏసీసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, నాయకులు బండ్ల రాజశేఖర్‌రెడ్డి, విక్రమసింహారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ముత్యంరెడ్డితోపాటు గద్వాల నియోజకవర్గంలోని ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు, ఆర్యవైశ్యసంఘం పట్టణ అధ్యక్షుడు సురేశ్‌శెట్టి, ప్రధానకార్యదర్శి నరహరి శ్రీనివాసులు, గట్టు ఈశ్వరయ్య, రామశెట్టి, శ్రీకాంత్ పుష్పగుచ్ఛం, గజమాలతో సత్కరించారు.