హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): జాతీయంగా గల సెంట్రల్ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను మార్చి 6 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. 157 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనుండగా ఈ సారి 4,11,366 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రేపు జేఈఈ మెయిన్-1 ఫలితాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్-1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ముందుగా ఫైనల్ కీ విడుదల చేసిన తర్వాత ఎన్టీఏ ఫలితాలను విడుదల చేయనున్నది. ఈ పరీక్షలను జనవరి 21 నుంచి 29 వరకు నిర్వహించారు. వాస్తవానికి ఈ నెల 12నే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా, 16కు ఎన్టీఏ వాయిదావేసింది.