హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ జయాపజయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తున్నది. హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలను కైవసం చేసుకొనే దిశగా వ్యూహరచన చేశారు.
చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. పార్టీకి చెందిన ఎక్స్అఫీషియో సభ్యులకు ఓట్ల కేటాయింపుపై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు కీలకనేతలతోనూ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది.