హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..
పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. మౌలిక వసతులు కల్పించాలి..
జూలై 1-10 వరకు విస్తృతంగా కార్యక్రమాలు..
అధికారులు, ప్రజాప్రతినిధుల సమీక్షలో మంత్రి అల్లోల
నిర్మల్ కలెక్టరేట్లో సమావేశం
నిర్మల్ టౌన్, జూన్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక త్వంలో రేపటి నుంచి చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతితో పాటు తెలంగాణ హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేద్దా మని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాల యంలో నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హ రితహారం నిర్వహణపై ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్‌తో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించా రు. జూలై 1 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలతో పాటు గ్రా మాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించా ల ని కోరారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో ప్రకృతివనాలు, డంప్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, సీసీ రోడ్లు వంటివి పూర్తి చేశామని వివరించారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసి, వాటి నాటేలా చూడాలన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం ప్రతి నెలా రూ. 339 కోట్లు గ్రామాలకు, మున్సిపాలిటీలకు రూ. 148 కోట్లు విడు దల చేస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మండ లస్థాయిలో పని చేసే అధికారులు తప్పకుండా ప్రజాప్రతినిధులకు సమాచా రమివ్వాలని సూచించారు. ఖానాపూర్ ఎమ్మె ల్యే రేఖానాయక్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు తీసు కోవాలన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్పర్స న్ విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, రాజేందర్, అధికారులు వెంకటేశ్వర్రావు, సుధీర్‌కుమార్, కిరణ్ కుమార్, ప్రణీత, స్రవంతి, శ్రీనివాస్‌రెడ్డి, హన్మాండ్లు, శ్రీనివాస్ గౌడ్, దేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
నిర్మల్ అర్బన్, జూన్ 29: పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని బేస్తవార్పేట్కు చెందిన బారె లక్ష్మి కొద్ది రోజులు గా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందింది. అలాగే పట్టణానికి చెందిన వడ్ల సాయిబాబా వడ్ల మిషన్‌లో చేతి వేలు ఇరుక్కు పోవడంతో చికిత్స పొందారు. వీ రిద్దరూ పేదలు కావడంతో కౌన్సిలర్ ఎడిపెల్లి నరేందర్ మంత్రి అల్లోల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 18వేలు, రూ.12వేల చెక్కులను క్యాంపు కా ర్యాలయంలో మంత్రి అందజేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మారుతి, రవి తదితరులున్నారు.