e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జగిత్యాల అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఆర్జన

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఆర్జన

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఆర్జన

అసైన్డ్‌ భూములు కొన్నానని చెప్పడం చట్ట వ్యతిరేకం కాదా..
ఎమ్మెల్యే పదవికి ఈటల తక్షణమే రాజీనామా చేయాలి
కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు

హుజూరాబాద్‌ టౌన్‌, మే 27: మంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్‌ భూములు ఆక్రమించడం, వేలకోట్ల ఆస్తులను అక్రమ ఆర్జన చేయడం చట్టవ్యతిరేకమైన చర్య అని కరీంనగర్‌ మేయర్‌, టీఆర్‌ఎస్‌పార్టీ హుజూరాబాద్‌ పట్టణ, మండల ఇన్‌చార్జి యాదగిరి సునీల్‌రావు ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఐక్యమత్యంగా ఏకాభిప్రాయంతో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మరింత ముందుకు పోతుందన్నారు. మంత్రి హోదాలో ఉన్న ఈటల రాజేందర్‌ అత్యాశతో కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశాడని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకే ఈటలను మంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్‌ బర్తరఫ్‌ చేశారని తెలిపారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న రాజయ్యను తప్పు చేస్తే మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ నిజాయితీగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారని గుర్తు చేశారు. కానీ ఈటల రాజేందర్‌ మాత్రం తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయకముందే పార్టీ నియమాలు ఉల్లంఘించారని పేర్కొన్నారు.

ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకున్నానని, వామపక్ష భావజాలం కలిగిన వాడినని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్‌ బీజేపీ చుట్టూ తిరుగుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్‌కు ఏమాత్రం నైతికత ఉన్నా ఇతర పార్టీలకు వెళ్లే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సునీల్‌రావు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు అపార విశ్వాసం ఉందని, హుజూరాబాద్‌లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ మెజార్టీ ఇస్తారని సునీల్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, హరీశ్‌రావు, మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్‌కుమార్‌ నాయకత్వంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ, అనుబంధ సంఘాలైన టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్‌వై కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు అందరం సమష్టిగా కృషి చేస్తామని సునీల్‌రావు పేర్కొన్నారు.

కాగా ఈటల కక్షపూరితంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన పోతిరెడ్డిపేట సర్పంచ్‌ తాటికొండ పుల్లాచారికి సునీల్‌రావు పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు పడిదం బక్కారెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, హుజూరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బర్మావత్‌ రమా, సింగిల్‌ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట మాజీ పట్టణాధ్యక్షులు పంజాల కుమారస్వామి, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, కల్లెపల్లి రమాదేవి, ఎ ముత్యంరాజు, ముక్క రమేశ్‌, బీ యాదగిరినాయక్‌, వెన్నంపల్లి కిషన్‌, బీ శివకుమార్‌, తొగరు సదానందం, తోట రాజేంద్రప్రసాద్‌, ఎం కుమార్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గందె శ్రీనివాస్‌, మొలుగు పూర్ణచందర్‌, మంద రమేశ్‌, జీ భాస్కర్‌, పీ అనిల్‌యాదవ్‌, సంగెం ఐలయ్య, టీఆర్‌ఎస్‌ యూత్‌ పట్టణాధ్యక్షుడు గందె సాయిచరణ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ సోషల్‌ మీడియా కన్వీనర్‌ గాలి రాకేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎండి రియాజ్‌, మక్కపెల్లి రమేశ్‌యాదవ్‌, చొల్లేటి శ్యామ్‌, భూసారపు బాబురావు, వీ విక్కీ, షేక్‌ ఫయాజ్‌, చందాగాంధీ, బత్తుల సమ్మయ్య, మధూకర్‌రెడ్డి, బోళ్ల రమేశ్‌, కక్కెర్ల సారయ్య, డిష్‌ రవీందర్‌రావు, మొలుగు శ్రీనివాస్‌, పంజాల మురళిగౌడ్‌, బాబా మహ్మద్‌, కర్రి సత్యం, కాపర్తి సంతోష్‌, కొలిపాక రవి, దయాకర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఆర్జన

ట్రెండింగ్‌

Advertisement