మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు
పలు అభివృద్ధి పనుల ప్రారంభం
లక్షెట్టిపేట రూరల్, జూన్ 25 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. మండలంలోని జెండావెంకటాపూర్‌లో రూ. కోటి 25 లక్షలతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం, ఎస్ఎల్ఆర్ బ్రిడ్జి పనులు, బలరావుపేటలో రూ. 39 లక్షలతో చేపట్టిన చెక్‌డ్యాం, లక్ష్మీపూర్‌లో రూ. 10 లక్షలతో వేస్తున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆ యా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ, మధ్యతరహా, చిన్న నీటి పారుదలపైన ప్రత్యేకంగా తక్కువ ఖర్చు ఎక్కువ లాభం అనే విధానంతో సర్కారు ముందుకెళ్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి పక్షాలకు పని లేకుండా పోయిందని, దీంతో వారు చిల్లర రాజకీయాలు చేయడం మొదలు పెట్టారన్నారు. తప్పుడు మాటలు చెప్పే పార్టీలను దూరం పెట్టాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు చిన్నన్న, ఉపాధ్యక్షుడు అంకతి ర మేశ్, ప్రజాప్రతినిధులు వెల్తపు సునీత, సుధాకర్, శ్రీనివాస్, కోన సరిత, కందుల మోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు.