వికారాబాద్, జనవరి 23: వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లి కాలనీలో ప్రజలు ఆదివారం మైసమ్మ జాతర నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లతో పోతరాజులు విన్యా సాలు చేస్తూ ఊరేగింపు తీశారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాన్ని చల్లంగా చూడాలంటూ అమ్మవారికి మొక్కుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ రమేశ్‌కుమార్, స్థానిక కౌన్సిలర్ ప్రవళిక, కౌన్సిలర్లు నవీన్‌కుమార్, కృష్ణ, అనంత్‌రెడ్డి, నాయకులు కృష్ణ, సుభాన్‌రెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారికి పూజలు చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ధారూరు, జనవరి 23 : ధారూరు మండల పరిధిలోని హరిదాస్‌పల్లి గ్రా మంలో మైసమ్మ జాతరను ం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక బోనాలు, పోతురాజుల విన్యాసాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ జాతరకు గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
తాండూరులో అంగరంగ వైభవంగా…
పెద్దేముల్, జనవరి 23 : తాండూరు పట్టణంలోని గుమాస్తా నగర్లో వెల సిన శ్రీ కట్ట మైసమ్మ బోనాల పండుగను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 45 సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టమైసమ్మ వెలి శారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఆదివారం రోజున కాలనీవాసులు అమ్మవారికి బోనాలను, నైవేద్యాలను సమర్పిస్తారు. భక్తులు పూజలు నిర్వ హించి తమ కోరికలను తీర్చాలని మొక్కులు చెల్లించుకుంటారు.
కొడంగల్ పట్టణంలో…
కొడంగల్, జనవరి 23: పట్టణంలోని గాంధీనగర్ వీధిలో ఆదివారం బోనమ్మ సుందరమ్మ గ్రామ దేవతకు ఘనంగా బోనాలు సమర్పించి మొ క్కులు తీర్చు కున్నారు. పిల్లా పాపలను, ఇంటిని చల్లంగ చూడాలని అమ్మ వారిని వేడుకున్నారు. ప్రజారోగ్యాలను కాపాడాలని పూజించారు.