జెడ్పీ చైర్పర్సన్ సరిత
ధరూర్, నవంబర్ 22 : శ్రీకృష్ణ దేవరాయ సమకాలికుడు భక్త కనకదాసు అని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మండలకేంద్రంలోని వైఎస్సార్ చౌరస్తాలో కుర్వ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్త కనకదాసు జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక నాయకులు, కుర్వ సంఘం నాయకులతో కలిసి భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనకదాసు తన రచనల ద్వారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపి ప్రజలను సామాజికంగా చైతన్య పర్చారన్నారు. భక్త కనకదాసు జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాగే నీలహళ్లి గ్రామంలో కుర్వ సంఘం ఆధ్వర్యంలో భక్త కనకదాసు జయంతి వేడుకలకు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నీలహళ్లి సర్పంచ్ శాంతమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ కుర్వమహాదేవమ్మ, నడిగడ్డ రైతుహక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగుళ్ల కుర్వ రంజిత్‌కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహులు, కురువ సంఘం నాయకులు కిష్టన్న, ధరూర్ రవి, సీతారాములు, శ్రీను, గవ్వల పరశురాం, రంగస్వామి, మల్దకల్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాపరంగా యువతను ప్రోత్సహించాలి
గట్టు, నవంబర్ 22: కుల బంధువులందరూ ఐక్యంగా విద్యాపరంగా యువతను ప్రోత్సహించాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత పిలుపునిచ్చారు. సోమవారం మండలకేంద్రంతోపాటు ఆలూరు, బలిగేర, బోయలగూడెం గ్రామాల్లో భక్త కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గట్టు వైస్‌ఎంపీపీ సుమతి, రామాంజనేయులు, టీఆర్ఎస్ నాయకుడు తిరుపతయ్య, గట్టు సర్పంచ్ ధనలక్ష్మి, బలిగెర సర్పంచ్ బాసు హన్మంతు నాయుడు, ఎంపీటీసీ రూపావతి, కిష్టప్ప, కృష్ణమూర్తి, వీరేశ్, నర్సింహ, వీరన్న, భీమేశ్, గోపాల్, మారెప్ప, తిమ్మన్న, నర్సింహులు, గోవింద్, డోలు గోవింద్, రామకృష్ణ, మల్లప్ప, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కేశవులు, ఎల్లప్ప, క్రాంతి, రాములు, మనోజ్, రవి, మల్లేశ్, పల్లయ్య, శ్రీను, బజారి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.