ధారూరు, డిసెంబర్ 21: గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారం గ్రామంలో పర్యటించి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలోని ప్రజల అభిప్రాయంతో ప్రధాన సమస్యల పరిష్కారమవుతాయని, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసే విధంగా విధి విధానాలతో ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికోసం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలపై అధికారులతో మాట్లాడి త్వరలో పరిష్కారం కావాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా కొవిడ్ వ్యాక్సినేషన్ టీకా తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. కొంత మందికి రెవెన్యూ సమస్యలు ఉన్నాయని సభ దృష్టికి తేగా, వాటిని రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ధారూరు వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, గ్రామ సర్పంచ్ అమర్నాథ్, ధారూరు తాసిల్దార్ భీమయ్యగౌడ్, ఎంపీవో షఫీఉల్లా, మండల వ్యవసాయశాఖ అధికారి జ్యోతి, ధారూరు, కుక్కింద సర్పంచులు చంద్రమౌళి, వీరేశం, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు జైపాల్‌రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజునాయక్, అంజయ్య, లక్ష్మయ్య, చంద్రయ్య, చిన్నయ్యగౌడ్, రాజుగుప్తా, రాములు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.