డిచ్పల్లి/ఇందూరు, డిసెంబర్ 21: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన 3,4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య డి.రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ ఆచార్య కె.శివశంకర్, పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య అరుణ మంగళవారం విడుదల చేశా రు. మూడో సెమిస్టర్లో 9,727 మంది విద్యార్థులు హాజరు కాగా 2,835 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని.. 6,892 మంది ప్రమోట్ కాగా 29.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. నాల్గో సెమిస్టర్లో 9,064 మంది విద్యా ర్థులు హాజరుకాగా 3,135 మంది ఉత్తీర్ణులయ్యారని.. మిగతా 5,929 మంది ప్రమోట్ కాగా 34.58 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలను www.tuexams.org వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో యూజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.
జీజీ కళాశాలలో..
జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో జూలై, ఆగస్టు 2021లో నిర్వహించిన 1, 3వ సెమిస్టర్ (రెగ్యులర్), సెప్టెంబర్ 2021లో నిర్వహించిన 2, 4వ సెమిస్టర్ (రెగ్యులర్) బీఏ/బీకాం/బీబీఏ/బీఎస్సీ, పరీక్షా ఫలితాలను మంగళవారం ప్రొఫెసర్ ఎం.అరుణ విడుదల చేశారు. ఫలితాలను కళాశాల వెబ్సైట్ www.ggcnzb.com లో చూసుకోవచ్చని కళాశాల ఇన్చార్జి అబ్దుల్ రఫీక్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వేణుప్రసాద్ తెలిపారు. రీవాల్యువేషన్, రీకౌన్సెలింగ్ కోసం ఈ నెల 29 సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలోని పరీక్షల విభాగంలో గల కౌంటర్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళాశాలలో 4వ సెమిస్టర్లో మొత్తం 60.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.