
పాత బావులే డింపింగ్ యార్డులు
దుబ్బాక మున్సిపల్లో స్థలాల కొరత
రోడ్ల పక్కన బావుల్లో చెత్త పారవేత
దుర్గంధంతో ఇబ్బందిపడుతున్న జనం
దుబ్బాక టౌన్, నవంబర్ 21 : మున్సిపాలిటీలో రోడ్లన్నీ చెత్తగా మారాయి. పాడుబడ్డ, పాతబావులే డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. మున్సిపాలిటీకి డంపింగ్ యార్డులు పాత బావులే దిక్కయ్యాయి. రోడ్ల పక్కన చెత్తను వేయడంతో వాటి నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ప్రతి రోజూ సేకరించిన చెత్తను రోడ్డు పక్కన, పాడుబడ్డ బావుల్లో పోస్తున్నారు. దీంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నది. అంతేకాకుండా చెత్తను కాల్చడం తో వచ్చే పొగతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. దుబ్బాక పట్టణంలోని దుం పలపల్లి రోడ్డులో మున్సిపల్‌కు కేటాయించిన స్థలంలో కొన్ని నెలల పాటు తాత్కాలికంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేశా రు. దీని ద్వారా దుర్వాసనతోపాటు కుక్కల బెడద తీవ్రం కావడంతో డంపింగ్ యార్డును తొలిగించారు. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు స్థలం లేకపోవడంతో రోడ్ల పక్కన, పాడుబడ్డ బావుల్లో చెత్తను నింపుతున్నారు. ఇప్పటికే ధర్మాజీపేట రోడ్డులో ఉన్న పాతబావి ఇప్పటికే చెత్తతో పూర్తిగా నిండినది. దుంపలపల్లి రోడ్డులోని కల్యాణం మండపం ప్రాంతంలో ఉన్న పాతబావిలో పట్టణంలో సేకరించిన చెత్తను మున్సిపల్ కార్మికు లు పారబోస్తున్నారు. దీంతోపాటు చీకోడు రోడ్డులో ఉన్న పాత బావిలో చెత్త వేస్తున్నారు. ఫలితంగా చెత్తను నుంచి వచ్చే దు ర్వాసనతోపాటు కుక్కల బెడద అధికంగా ఉంటున్నది.
డంపింగ్ యార్డులకు స్థలాల సమస్య…
దుబ్బాక మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులకు స్థలాల సమ స్య ఏర్పడింది. ఏదుల్లా చెరువులో గతంలో డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టగా, చెరువు శిఖంలో ఉండడంతో పనులను మ ధ్యలోనే నిలిపివేశారు. లచ్చపేటలో డంపింగ్ యార్డు పనులు ముందుకు సాగడం లేదు. చెల్లాపూర్‌లో ఇటీవలే పనులు ప్రారంభయ్యాయి. ధర్మాజీపేటలో డంపింగ్ యార్డు లేదు. పట్టణంలో నాలుగు దిక్కుల్లో డంపింగ్ యార్డులు నిర్మిం చి చెత్త సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
దుబ్బాక మున్సిపాలిటీలో డంపింగ్ యార్డుల నిర్మాణానికి స్థలాల కొరత ఉన్నది. ఫలితంగా అనేక సమస్యలు వస్తున్నాయి. డంపింగ్ యార్డులు లేక పో వడంతో తాత్కాలికంగా పాడుబడ్డ బావులు, రోడ్డ వెంబడి చెత్తను పార వేయాల్సి వస్తున్నది. త్వరలోనే మున్సిపల్లో నాలుగు ది క్కుల్లో స్థలాలను సేకరించి డంపింగ్ యార్డులను నిర్మిస్తాం.
– గణేశ్‌రెడ్డి (దుబ్బాక మున్సిపల్ కమిషనర్)