
గజ్వేల్, నవంబర్ 21 : నిరుపేదల కుటుంబాలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం పొందడానికి సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి 17వ వార్డు కు చెందిన వెంకటేశానికి రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వైద్యం పొందలేక గతంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారని, ప్రస్తుతం ప్రతి పేదవాడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం కేసీఆర్ ఆర్థికసాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మీకిషన్రెడ్డి, బొగ్గుల చందు, దుర్గాప్రసాద్, గంగిశెట్టి రవీందర్, నవాజ్ మీరా ఆహ్మద్, పల్లె పహాడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌చారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కొండపోచమ్మ ఉత్సవాలకు ఆహ్వానం
ఈనెల 24న జరుగనున్న కొండపోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకా వాలని ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఈవో మోహన్‌రెడ్డి, ఆలయ కమి టీ నాయకులు కిషన్‌రెడ్డి, రవీందర్, నవాజ్, శ్రీనివాస్, ఆహ్మద్, శేఖర్ తదితరులున్నారు.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో ‘ఆర్ఆర్’ కాలనీవాసులు రాణించాలి
వ్యాపార, వాణిజ్య రంగంలో ఆర్ అండ్‌ఆర్ కాలనీవాసులు రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని ఎఫ్ఢీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. పల్లెపహాడ్ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సెల్‌ఫోన్ దుకాణాన్ని మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టునిర్వాసిత గ్రామాల ప్రజలు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ప్రభుత్వం అందజేసిన పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఆర్అండ్ఆర్ కాలనీయే అద్భుతమైన వ్యాపార కేంద్రంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో పల్లెపహడ్ ఉపసర్పంచ్ నాగరాజు, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.