
భారీగా పెరిగిన అడ్మిషన్లు
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్లో చేరిక
కళకళలాడుతున్న పాఠశాలలు
హన్వాడ, నవంబర్ 21 : ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ప్ర భుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. కరోనా సమయంలో సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో వి ద్యార్థుల చేరిక సంఖ్య తగ్గింది. కరోనా వైరస్ భయం వీడి, స్కూల్ ఫీజులు కట్టలేని స్థితితో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న సంఖ్య పెరుగుతున్నది. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురో జుకూ తగ్గి ప్రభుత్వ బడుల్లో హాజరుశాతం పెరుగుతున్నది. విద్యార్థులతో బడులు కళకళలాడుతున్నాయి. తరగతి గది లో విద్యార్థుల సంఖ్య పెరుగడంతో ఉ పాధ్యాయులు ఏమి చేయలేని పరిస్థితి లో పడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం నోట్‌పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనంతోపాటు అ న్ని సౌకర్యాలు కల్పిస్తున్న విషయం తె లుసుకున్న తల్లిదండ్రులు ప్రైవేట్‌పై మొగ్గు చూపకుండా ప్రభుత్వ బడులపై ఆసక్తి చూపుతూ పిల్లలను బడుల్లో చే ర్పిస్తున్నారు. గతంలో ప్రైవేట్‌పైనే ఎ క్కువగా శ్రద్ధ పెట్టేవారు, ఇప్పుడు నా ణ్యమైన విద్యతోపాటు ఇంగ్లిష్, తెలు గు మీడియం ఉండడంతో పిల్లలు ప్ర భుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. మండలంలో ప్రాథమిక 47, ప్రాథమికోన్నత 5, ఉన్నత పాఠశాలలు 13 ఉన్నాయి. గతంలో మొత్తం 5,4 11 మంది విద్యార్థులు కరోనా వైరస్ ముందు చదువుకునేవారు. ఇప్పుడు మొత్తం 7,760 ఉన్నారు. 2,349 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. ఇక రోజు రోజుకూ విద్యార్థుల సంఖ్య పెరుగుతు న్నది. మండలంలో ఏ పాఠశాలకు వెళ్లినా విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యార్థులకు కొవిడ్ ని బంధనలతో విద్యను ఉ పాధ్యాయులు అందిస్తున్నారు.