
గుమ్మడిదల మండలంలో అధిక దిగుబడి సాధించిన రైతులు
రైతులను అభినందించిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
గుమ్మడిదల, నవంబర్ 20 : సహకార వారోత్సవాల్లో భాగంగా అధిక దిగుబడి సాధించిన రైతులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సన్మానించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి సహకార వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు 13 గ్రామాల్లో రైతులు పం డించిన వివిధ పంటల్లో మంచి దిగుబడి సాధించిన రైతులను ఉత్తమ రైతులుగా ఎంపిక చేశారు. శనివారం వీరికి ఎమ్మెల్యే శాలువా, పూలదండలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ వెన్నంటి ఉంటూ పెద్దన్నగా ఆదుకుంటున్నాడన్నారు. మండలంలోని గ్రామాల్లో రైతులు వ్యవసాయ రంగంలో రాణించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో సూచించిన పంటలను సాగు చేసి ఉత్తమ రైతులుగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి,సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, రాజశేఖర్, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, సీనియర్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, రైతులు బాల్‌రెడ్డి, నల్లారెడ్డి, రఘు, సుధాకర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, సురేశ్, జంగేటి భిక్షపతి పాల్గొన్నారు.