
ధూళిమిట్టలో రెండో రోజూ ఘనంగా బండ్లు బోనాలు
దుర్గమ్మ, కనకదుర్గమ్మ, మాతమ్మకు నైవేద్యాలు
జాతరను తలపించిన ఉత్సవాలు
వేడుకలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరు
ధూళిమిట్ట, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో సర్పంచ్ దుబ్బు డు దీపిక వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బండ్ల బోనాల జాతర రెండోరోజూ శనివారం ఘనంగా జరిగింది. దుర్గమ్మ, కనకదుర్గమ్మ, మాతమ్మకు బోనాల సమర్పణ వేడుక కనుల పండువగా సాగింది. ఈ ఉత్సవాలతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు పుర వీధులగుండా డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు, నైవే ద్యం సమర్పించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. ఇటీవల ఏర్పాటు చేసిన బొడ్రా యి వద్ద ఆధ్యాత్మిక గురువులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని దుర్గమ్మ, మాతమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు సర్పంచ్ సత్కరించారు. కార్యక్రమంలో మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ ధూళిమిట్ట, మద్దూరు మండలాల అధ్యక్షులు యాదగిరి, సంతోష్, ఉప సర్పంచ్ మధు, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ, మాజీ జడ్పీటీసీ పద్మావెంకట్, మాజీ సర్పంచ్లు పద్మాలక్ష్మణ్, రచ్చ లక్ష్మయ్య, సీతారామారావు, డీడీఎఫ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.