నిజామాబాద్ సిటీ, నవంబర్ 19: జిల్లాలో మ ద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం దుకాణాలకు 1672 దరఖాస్తులు రాగా ఇందులో నిజామాబాద్ పరిధిలో 733, బోధన్ పరిధిలో185, ఆర్మూర్ పరిధిలో 314, భీమ్‌గల్ పరిధిలో 209, మోర్తాడ్ పరిధిలో 231 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శనివారం లక్కీడ్రాను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పా ట్లు చేశారు. శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి రా జీవ్‌గాంధీ అడిటోరియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లక్కీడ్రాలో భాగంగా రాజీవ్‌గాంధీ అడిటోరిం వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నా రు. కలెక్టర్ వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ నందగోపాల్, సీఐ సాయన్న ఉన్నారు.
భారీగా ఆదాయం
జిల్లాలో మద్యం దుకాణాలకు గతంలో కన్నా ఈ సారి భారీగా దరఖాస్తులు వచ్చాయి.ప్రారంభంలో చాలా తక్కువగా రాగా చివరి రెండు రోజులు దరఖాస్తులు వెల్లువెత్తాయి. చివరిరోజే 900కుపైగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో కన్నా ఈ సారి 500కు పైగా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు రూ.33,44,00,000లు అదాయం వచ్చింది.
కామారెడ్డిలో ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలోని 49 మ ద్యం షాపులకు శనివారం ఉదయం లక్కీడ్రా నిర్వహించనున్నారు. 49 మద్యం షాపులకు గాను 960 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న రేణుకా దేవీ ఫంక్షన్ హాల్లో డ్రాను నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్, గురువారం ఏ ర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.