e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జిల్లాలు అటవీ సంరక్షణ అందరి బాధ్యత

అటవీ సంరక్షణ అందరి బాధ్యత

అటవీ సంరక్షణ అందరి బాధ్యత

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య
ములుగుటౌన్‌, జూలై19 : అటవీ సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. కలప స్మగ్లింగ్‌ను అరికడుతూనే వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల అటవీ సంరక్షణ, ఆక్రమణ, వివాదాలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆశతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు ఫారెస్ట్‌ భూముల విషయంలో గ్రామ సభలు నిర్వహించి ఏవైనా సమస్యలు ఉంటే తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్‌ అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నా రు. అడవుల సంరక్షణలో భాగంగా జిల్లాలోని టింబర్స్‌, కార్పెంటర్స్‌, స్మగ్లర్ల వివరాలు సేకరించి అందులో టాప్‌ 10 శాతంపై దృష్టి పెట్టి అడవులను కాపాడాలన్నారు. అడవిలోకి పులి వచ్చినప్పుడు దారికి ఇబ్బందులు లేకుండా భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం అడవికి వెళ్లేలా చూసుకోవాలన్నారు. చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆశ మాట్లాడుతూ హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ఎన్‌ఆర్‌ఈజీఏ పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ ప్రతి బుధవారం నిర్వహించే సమావేశానికి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు తప్పకుండా హాజరై హరితహారంపై సూచనలు ఇస్తూ మొక్కలే ఎక్కువ శాతం బతికేలా చూడాల న్నారు. సమావేశంలో ఏటూరునాగారం, భద్రాచలం ఐటీడీఏ పీవోలు హన్మంత్‌ కే జండగే, గౌతం, డీఆర్వో రమాదేవి, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఫారెస్ట్‌ అధికారులు లావణ్య, ప్రదీప్‌ కుమార్‌ శెట్టి, అధికారి జోగేందర్‌, తాడ్యాయి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
అటవీ సంరక్షణ అందరి బాధ్యత

ట్రెండింగ్‌

Advertisement