షాద్‌నగర్‌టౌన్, జనవరి 19 : సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన ఉమామహేశ్వరికి మంజూరైన రూ. 21500 సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును బుధవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్యానికి కొండంత భరోసానిస్తుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
కేశంపేట : నిరుపేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని సంతాపూరానికి చెందిన నాగుల చంద్రయ్యకు మంజూరైన రూ. 5 లక్షల ఎల్వోసీ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకన్నయాదవ్, యాదయ్యగౌడ్, లక్ష్మయ్య, భూపాల్‌రెడ్డి, జగన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో కార్పొరేట్ వైద్యం
కొత్తూరు, జనవరి 19 : సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఎం వెంకటయ్యకు రూ. 60 వేల చెక్కును ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయాదవ్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, యాదయ్య, రియాజ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ప్రతీ కార్యకర్తకు అండగా టీఆర్ఎస్
కొత్తూరు రూరల్ : ప్రతీ కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కర్రోళ్ల జంగయ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. జంగయ్యకు పార్టీ సభ్యత్వం ఉండటంతో టీఆర్ఎస్ తరుపున రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కు మంజూరైంది. దీంతో జంగయ్య భార్యకు ఎమ్మెల్యే చెక్కు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్‌నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, మాజీ మండలాధ్యక్షుడు యాదగిరి, నాయకులు దేవేందర్‌యాదవ్, పాపయ్యయాదవ్, గోపాల్‌నాయక్, ఇంద్రసేనారెడ్డి, బ్రహ్మచారి, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.