మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రకటనపై సంబురాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్న ప్రజలు
విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం హర్షం
మంచిర్యాల, మే 18, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ, అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ప్రాంతానికి వైద్య కళాశాల రావాలనే జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కొవిడ్ 19పై సోమవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు జిల్లాల్లో ఈ కళాశాలల ఏర్పాటు ప్రకటన చేయగా, అందులో మన జిల్లా ఉండడం అందరినీ సంతోషంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో జిల్లాకేంద్రంతో పాటు చెన్నూర్, రామకృష్ణాపూర్, లక్షెట్టిపేటలో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మద్దతుగా నినాదాలు చేశారు. మరోవైపు విప్ సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ, అనుబంధంగా నర్సరీ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించింది. కొవిడ్ -19 పై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు కానుంది. దశాబ్దాల కల నెరవేరడంతో జిల్లావాసులు సంబురాల్లో మునిగితేలారు. మంగళవా రం జిల్లాకేంద్రంలో పటాకులు కాల్చారు. చె న్నూర్, రామకృష్ణాపూర్ తోపాటు జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత చాటుకున్నారు. కాలేజీ మంజూరుపై విప్ సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యతో పాటు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు.
మెడికల్, నర్సింగ్ కళాశాల ఆవశ్యకత..
జిల్లాలో మెడికల్ కాలేజీ కావాలని దశాబ్దాల పాటు డిమాండ్ ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే స్వరాష్ట్రంలో మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏళ్ల కల త్వరలోనే తీరనున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌తో జిల్లాతో పాటు జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ప్రజలు, నిర్మల్ జిల్లా కడెం వరకు వైద్యం కోసం మంచిర్యాలకు వస్తుంటారు. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రస్తావించారు. మంచిర్యాలలో దాదాపు 300 మంది డాక్టర్లున్నారని, 50 నర్సింగ్‌హోంలు ఉన్నాయని, దాదాపు 300 మంది అడ్వకేట్లు కూడా ఇటీవల వచ్చారని తెలిపారు. కాలేజీ ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రిని కోరారు. జిల్లాకేంద్రంలో 4, 5 నియోజకవర్గల ప్రజలు నివాసముంటున్నారు. వారందరికీ మం చిర్యాల కేంద్ర బిందువుగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లానే కాకుండా పెద్దపల్లి, ఖానాపూర్, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు సైతం వైద్యానికి మంచిర్యాలకు వస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే వం దల కిలో మీటర్లు వెళ్లి మెరుగైన వైద్యం చేయించాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లానుంచి 80 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్, 150 కిలోమీటర్ల దూరంలోని వరంగల్, లేదంటే దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌కు వెళాల్సి వస్తున్నది. సిర్పూర్, ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ 400 కిలోమీటర్ల పైగా దూరం ఉండడంతో జిల్లాలో మెడికల్ కాలేజీ కోసం జిల్లావాసులు చిరకాలంగా కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా లో సింగరేణి కాలరీస్, శ్రీరాంపూర్ ప్రాంతాలు అధికంగా, కార్మికులు అత్యధికంగా ఉండడంతో ప్రభుత్వ పరంగా కానీ, సింగరేణి పరంగా కానీ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య కళాశాల ఏర్పాటుతో ఇటు గిరిజనులకు, అటు సింగరేణి ఉద్యోగులకు ఎంతో మేలు కలుగనుంది. అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో రానుండడంతో బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరిగినా, రోడ్డు ప్రమాదాలకు గురైనా, మెడికల్ కళాశాలలో మెరుగైన వైద్యం సకాలంలో అందించే వెసులుబాటు లభించనుంది. ముఖ్యంగా వైద్య, నర్సింగ్ కళాశాలలతో విద్యార్థులకు అధిక ప్రయోజనం చేకూరునున్నది. మెడికల్ కోర్సును చదివే వారికి ఆర్థిక, దూర భారం తగ్గుతుంది. సదరు విద్యనభ్యసించిన వారి కి ఉద్యోగ భరోసా కూడా లభిస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మంచిర్యాల జిల్లా వైద్య పరంగాను ముందంజంలో ఉండేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి.
హామీలు బుట్టదాఖలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పటి నుంచే మంచిర్యాల లేదా బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. కాలేజీ ఏర్పాటయితే 27 మండలాలకు వైద్యం అందుబాటులో ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. 1998లో అప్పటి ప్రభుత్వం బెల్లంపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది బుట్ట దాఖలయ్యింది. దాదాపు రూ.కోటిన్నరకు పైగా డబ్బులు వెచ్చించి పాత కెమికల్ భవనాన్ని కొత్తగా మా ర్చారు. అనంతరం వివక్ష కొనసాగడం, నాటి పా లకుల పట్టింపులేమితో తుది దశలో ఆగిపోయిం ది బెల్లంపల్లిలో కాలేజీ ఏర్పాటు ప్రజాప్రతినిధు ల నిర్లక్ష్యం వల్లే కాలేదనే విమర్శలున్నాయి. మరో వైపు రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానను సింగరేణి మెడికల్ కళాశాల చేయాలనే ప్రతిపాదన సై తం ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారవడంతో ముందుకెళ్లలేదు. మంచిర్యాల పట్టణం లో ప్రభుత్వ స్థలాలకు కొరత ఉంది. సీఎం నిర్ణయంతో మరోసారి భూదాన్ భూమి దీనికి సరైన స్థలంగా పట్టణవాసులు భావిస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో నర్సింగ్ కళాశాల నిర్మిస్తే స్థల సేకర ణ సులువవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సంబురాలు.. పాలాభిషేకాలు..
మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు అనుబంధంగా నర్సింగ్ కాలేజీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పా లాభిషేకం చేశారు. పలుచోట్ల పటాకులు కాల్చా రు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మెడికల్ కాలేజీ మంజూరుపై ఎమ్మెల్సీ హర్షం
కోటపల్లి, మే 18 : మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చే యడంపై ఎమ్మెల్సీ పు రాణం సతీశ్ కుమార్ హర్షం ప్రకటించారు. ఈ విషయమై ఎన్నోఏళ్లుగా జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అయితే గత పాలకులు పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభు త్వం హయాంలోనే కల నెరవేరిందని, సీఎంకు జి ల్లా ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.