e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు ‘రైతు బంధు’వు సీఎం కేసీఆర్‌

‘రైతు బంధు’వు సీఎం కేసీఆర్‌

‘రైతు బంధు’వు సీఎం కేసీఆర్‌

ప్రజా ప్రతినిధులు, అన్నదాతలు
లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడిసాయం
మురిసిన అన్నదాత కుటుంబాలు
ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
ఇక సాగుకు రంది లేదంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఆదిలాబాద్‌ రూరల్‌, జూన్‌ 15: రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్‌ మరోసారి నిరూపించుకున్నారు. వానకాలం తొలకరి ఇంక పూర్తిగా పలకరించకముందే రైతన్నకు పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచారు. మంగళవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు జమవగా, వీటిని అందుకొని కర్షకలోకం మురిసిపోతున్నది. ఆయా చోట్ల ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, ఊరువాడా సంబురాలు నిర్వహించింది.

రాష్ట్రంలో రైతాంగానికి మంచి చేసిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ మాత్రమేనని మం డల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గండ్రత్‌ రమేశ్‌ అన్నారు. మండలంలోని అంకోలిలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం ఆపత్కాలంలోనూ రైతులకు పెట్టుబ డి సాయం అందించి, అండగా నిలిచారని కొనియాడారు. రైతులు పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భూమన్న, ఎంపీటీసీలు కిషన్‌, బుచ్చన్న, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సంటిబాపు, విద్యాకమిటీ చైర్మన్‌ మల్లయ్య, నాయకులు సెవ్వ జగదీశ్‌, గంగయ్య, నరేశ్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

ఉట్నూర్‌, జూన్‌15: రైతుబంధు పథకంతో ప్రభుత్వం అన్న దాతలకు అండగా నిలిచిందని ఎంపీపీ పంద్ర జైవంత్‌రా వు అన్నారు. స్థానిక ఏఆర్‌ఎస్‌ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. పీఏసీఎస్‌ మండల అధ్యక్షుడు సామ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బాలాజీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్‌ అజీం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సింగారే భరత్‌, మాజీ ఎం పీటీసీ కందుకూరి రమేశ్‌, రవి చందర్‌ పాల్గొన్నారు.

బోథ్‌, జూన్‌ 15: పెట్టుబడి సాయం అందించి సీఎం కేసీఆ ర్‌ రైతు బాంధవునిగా నిలుస్తున్నారని బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌, రైతు బంధు సమితి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఎస్‌ రుక్మణ్‌సింగ్‌ అన్నారు. బోథ్‌, సొనాలలోని రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్ర పటాలకు మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఆత్మ చైర్మన్‌ మల్లెపూల సుభాష్‌, సర్పంచ్‌లు జీ సు రేందర్‌యాదవ్‌, బీ శ్రీధర్‌ రెడ్డి, సీ సదానందం, కే వెంకటరమణాగౌడ్‌, వెంకటేశ్‌, మశ్చెందర్‌, గోపి, అల్లకొండ ప్రశాంత్‌, మ హమూద్‌, ఎలుక రాజు, శ్రీకాంత్‌, రాయలు, శం కర్‌, పోత న్న, అమృత్‌రావు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌, జూన్‌15: దేశంలోనే తొలిసారిగా వ్యవసా య రంగంలో రాష్ర్టానికి సరికొత్త క్రాంతిని చూపిన సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మానంద్‌ అన్నారు. మండల కేం ద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్ర ప టానికి మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పాలాభిషే కం చేశారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు ఎస్కే జమీర్‌, నాయకులు ఫడ్‌ దిలీప్‌, లింగంపెల్లి రా జేశ్వర్‌, కొల్లూరి వినోద్‌, కేంద్రె మాధవ్‌, సోయం సతీశ్‌, రావణ్‌ముండె, సంజీవ్‌, తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ, జూన్‌ 15: మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రైతులు,టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళ వారం క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాజారాం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షు డు గోర్భండ్‌ బాలాజీ, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం బోథ్‌ ని యోజక వర్గ అ ధ్యక్షుడు శంకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కందం సూర్యకాంత్‌, బషీర్‌, రాజన్న, గంగాధర్‌, సునీల్‌ పాల్గొన్నారు.

ఇచ్చోడ, జూన్‌ 15 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్ర భుత్వం కృషి చేస్తున్నదని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. స్థానిక రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్‌ ఫ్ల్లెక్సీకి టీఆర్‌ఎ స్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు ముస్తాఫా, జిల్లా సీనియర్‌ నాయకులు ఏనుగు కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ సునీత, ఉప సర్పంచ్‌ లోక శిరీశ్‌ రెడ్డి, నాయకులు దాసరి భాస్కర్‌, వెంకటేశ్‌, రాథోడ్‌ ప్రకాశ్‌, అబ్థుల్‌ అజీమ్‌, రాథోడ్‌ ప్రవీణ్‌, భీముడు, బీపీఆర్‌, లతీఫ్‌, వై. శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముక్రా (కే) గ్రా మంలో సీఎం కేసీఆర్‌ ఫ్ల్లెక్సీకి సర్పంచ్‌, ఎంపీటీసీ, రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్‌, ఉప సర్పంచ్‌ వర్షతా యి, తిరుపతి, సంతోష్‌, జ్ఞానేశ్వర్‌, సురేశ్‌, పాల్గొన్నారు.

భీంపూర్‌, జూన్‌ 15: భీంపూర్‌, నిపాని, కరంజి(టి), అం దర్‌బంద్‌, పిప్పల్‌కోటి, ధనోరా రైతు వేదికల్లో మంగళవారం రైతులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. జడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌, ఎంపీపీ కుడిమెత రత్నప్ర భ, వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న, రైతు బంధు సమితి గ్రామాల అధ్యక్షులు ఉత్తంరాథోడ్‌, నరేందర్‌రెడ్డి, ఉల్లాస్‌, సర్పంచ్‌లు లింబాజీ, స్వాతిక, లలిత, రమాబాయి, కళ్యాణి, పెండెపు కృష్ణ, భూమన్న, నాయకులు జీ నరేందర్‌యాదవ్‌, కపిల్‌, అనిల్‌, ర వీందర్‌ తదితరులున్నారు.

తాంసి, జూన్‌ 15: మండలంలోని బండలనాగాపూర్‌, తాం సి, కప్పర్ల, హస్నాపూర్‌ రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రైతులు, నాయకులతో కలిసి జడ్పీటీసీ తాటిపెల్లి రా జు పాలాభిషేకం చేశారు. పంట పెట్టుబడికి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వమే ఇలా సాయం అందించడం అభినందనీయమని జడ్పీటీసీ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ సురుకుంటి మంజులా శ్రీధర్‌రెడ్డి, రైతుబంధు సమితి మం డలాధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పులి నారాయణ, సర్పంచ్‌లు కృష్ణ, సదానందం, వెంకన్న, కేశవ్‌రెడ్డి, నర్సింగ్‌, ఎంపీటీసీలు అశోక్‌, నరేశ్‌, నాయకులు అరుణ్‌కుమార్‌, పరమేశ్‌, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

జైనథ్‌, జూన్‌ 15: దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అన్నారు. జైనథ్‌ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్‌, జోగురామన్న చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పురుషోత్తంయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ ఆనంద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
గాదిగూడ, జూన్‌ 15: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ అడా చంద్రకళారాజు పేర్కొన్నారు. మండల కేంద్రంతోపాటు ఖండోరాంపూర్‌ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మంగళవారం పాలాభిషే కం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ యోగేశ్‌, ఎంపీ టీసీ రాథోడ్‌ కిరణ్‌, సర్పంచ్‌లు మెస్రం జైవంత్‌రావ్‌, హెచ్‌కే చంద్రహరి, రైతులు, కార్యకర్తలు ఉన్నారు.

బజార్‌హత్నూర్‌, జూన్‌15: మండలంలోని దేగామ, బజార్‌ హత్నూర్‌, పిప్పిరి గ్రామాల్లోని రైతు వేదిక భవనాల వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పెద్దసంఖ్యలో హాజరై సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ రాజారాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల వెంకన్న, నాయకులు బొడ్డు భోజన్న, కొడారి నరేశ్‌, అంకూష్‌, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బేల, జూన్‌ 15: మండలంలోని సాంగిడిలో రైతులు, టీఆ ర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే జోగురామన్న చిత్ర పటాలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిలా ఉపాధ్యక్షుడు గంభీర్‌ ఠాక్రే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని పేర్కొన్నారు. రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కుల మధుకర్‌, నాయకు లు సతీశ్‌ పవార్‌, కళ్లెం ప్రమోద్‌రెడ్డి, ఎంపీటీసీ కుంటాల రాకే శ్‌, సర్పంచ్‌లు కన్నాల సుమన్‌బాయి, గంగన్న, వాడ్కర్‌ తేజ్‌ రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాల చందర్‌, మహేందర్‌, గణేశ్‌, మి లింద్‌ రమాకాంత్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘రైతు బంధు’వు సీఎం కేసీఆర్‌
‘రైతు బంధు’వు సీఎం కేసీఆర్‌
‘రైతు బంధు’వు సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement