మహబూబ్‌నగర్, నవంబర్ 14 : ప్రపంచంలోని ప్రతి వ్యవస్థ సహకారంతోనే నడుస్తుందని డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని డీసీసీబీ బ్యాంక్ ఆవరణలో 68వ అఖిల భా రత సహకార వారోత్సవాల కార్యక్రమం నిర్వహించా రు. బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నెహ్రూ చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అ నంతరం సహకార పతాకాన్ని ఎగురవేశారు. బ్యాంక్ ను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతిఒక్కరూ సంకల్పంతో కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులంతా కలిసికట్టుగా పని చేసి బ్యాంక్ ను పటిష్టపర్చిలన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సీఈ వో లక్ష్మయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, జనర ల్ మేనేజర్ పురుషోత్తంరావు, సిబ్బంది పాల్గొన్నారు.
సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
భూత్పూర్, నవంబర్ 14 : సహకార సంఘాల బ లోపేతానికి కృషి చేయాలని సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి కోరారు. సహకార సంఘాల వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి కార్యాలయంలో జెండావిష్కరణ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో సంఘాలు ఉంటాయన్నా రు. కార్యక్రమంలో సీఈవో రత్నయ్య, డైరెక్టర్ రాము లు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ కృషి చేయాలి
బాలానగర్, నవంబర్ 14 : సహకార సంఘాల బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీసీఎంఎ స్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం అఖిల భా రత సహకార వారోత్సవాల్లో భాగంగా మండలకేం ద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సహకార పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం అధికారి శ్యామ్‌సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.
సహకార వారోత్సవాలు
మిడ్జిల్, నవంబర్ 14 : రైతులకు సేవలందిచడంతోపాటు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం తో ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తుందని పీఏసీసీ ఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మం డలకేంద్రంలో సహకార సంఘం కార్యాలయంలో స హకార పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో అందించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అల్వాల్‌రెడ్డి, ఎంపీటీసీ గౌస్, పీఏసీసీఎస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.