పాన్‌గల్, నవంబర్ 14 : బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రామికవికాస కేంద్రం నిర్వాహకులు లలి త ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని కదిరేపాడులో బాలలు ఘనంగా నిర్వహించారు. బాలలకు వివిధ రకాల ఆటపోటీలను నిర్వహించారు. ముందుగా మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్వీకే సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, నవంబర్ 14 : పట్టణంలోని శాఖ గ్రంథాలయం లో ఆదివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నా రు. చాచా నెహ్రూ చిత్రపటానికి మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వడ్డె శ్రీను, కౌన్సిలర్లు రామ్మోహన్‌రెడ్డి, అయ్యన్న, ఖాజామైనొద్దీన్, తిరుపతయ్య, కోఆప్షన్ సభ్యులు వసీంఖాన్, వహీద్, చాంద్‌పాషా, సాజద్అలీ, మంద ప్రశాంత్, వికాస్, పద్మ నెహ్రూ పాల్గొన్నారు.
మహనీయుడి అడుగుజాడల్లో నడవాలి
వనపర్తి టౌన్, నవంబర్ 14 : దేశ తొలి ప్రధాని జవహార్లాల్నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత పయణించాలని మాజీ మంత్రి జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌ప్రసాద్, రాధాకృష్ణ, వెంకటేశ్, బాబా, రవి, తిరుపతయ్య ఉన్నారు.
అంకూర్‌లో..
వనపర్తి రూరల్, నవంబర్ 14 : వనపర్తి మండలం అంకూ ర్ గ్రామంలో ఆదివారం బాలల దినోత్సవం పురస్కారించుకొని గ్రామస్తులు చిన్నారులకు ఆటపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రంగారెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆటపోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు మొగులయ్య, బీసీరెడ్డి, రవిశంకర్, అంగన్వాడీ టీచర్ పద్మమ్మ పాల్గొన్నారు.