
పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధులు
యువ నాయకులే అభివృద్ధి ప్రచారకులు
విద్యాక్షేత్రంగా సిద్దిపేట జిల్లాకేంద్రం
ఉపాధి కల్పనకు ఐటీ టవర్స్, పరిశ్రమలు
పటిష్టంగా విద్యార్థి కమిటీలు వేయాలి
సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థి నాయకులకు దిశానిర్దేశం చేసిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, నవంబర్ 13 : జిల్లాకేంద్రాన్ని ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన సాంకేతిక విద్యానిలయంగా రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సాయంత్రం సిద్దిపేటలోని తన కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థి, యువత నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో విద్యార్థి విభాగం కమిటీలను పటిష్టంగా వేయాలని సూచించారు. సిద్దిపేటలో సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు 4 పాలిటెక్నిక్ కళశాలలు, మొక్కజొన్న పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దిపేటలో మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళా డీగ్రీ, పీజీ కళాశాలలు, రెసిడెన్షియల్‌తోపాటు మోడల్, కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో సిద్దిపేటకు పరిశ్రమలు వస్తున్నాయని, యువతీయువకుల ఉపాధి కల్పనకు ఐటీ టవర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటను విద్యాక్షేత్రంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఈ విషయాలను మన ప్రాంత యువతకు వివరించాలని సూచిం చారు. యువ విద్యార్థులుగా మీ పాత్ర కీలకం అన్నారు. మీరే అభివృద్ధి ప్రచారకులు, పార్టీకి ప్రభుత్వానికి మీరే వారధులు అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడాహబ్‌ను ఏర్పా టు చేసుకున్నామని, దీని ఫలితంగా సిద్దిపేట నుంచి రాష్ట్ర, జాతీయస్థాయికి క్రీడాకారులు ఎంపికయ్యారని తెలిపారు.
పటిష్టంగా విద్యార్థి కమిటీలు..
సిద్దిపేట నియోజకవర్గవ్యాప్తంగా ప్రకటించనున్న టీఆర్ ఎస్ విద్యార్థి కమిటీలను పటిష్టంగా వేయాలని నాయకులకు మంత్రి సూచించారు. మండలాల వారీగా, పట్టణంలో సమన్వయ కమిటీలను వేయాలని, కమిటీ ఎన్నికలను నిర్వహిం చి చురుకైన విద్యార్థులను టీఆర్ఎస్వీలోకి ఆహ్వానించాలని తెలిపారు. సీనియర్లుగా ఉన్నవారిని పార్టీలోకి, విద్యార్థి నా యకులను యువత విభాగం కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలని వివరించారు. పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తిం పు ఉంటుదన్నారు. సమావేశంలో నాయకులు రాజనర్సు, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, మెరుగు మహేశ్, శేఖర్‌గౌడ్, ప్రశాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.