వనపర్తి టౌన్, నవంబర్ 13 : ఉచిత న్యాయసేవ, స హాయం అందించడమే న్యాయసేవా సాధికార సంస్థ ధ్యే యమని జిల్లా 9వ అదనపు న్యాయమూర్తి బి.శ్రీనివాసు లు అన్నారు. జిల్లాకేంద్రంలోని యాదవ్ సంఘ భవనం లో శనివారం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ఆ యన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ న్యాయ సేవ లు గ్రామగ్రామాన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఉచిత న్యాయ సేవల అవగాహనపై ఏర్పాటు చేసిన పాన్ ఇండియా అవెర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నిరుపేదకు న్యాయ సేవలు అందించాలని, రాజ్యాంగం మనకు హక్కు కల్పించింద ని, ఇది గ్రామస్థాయి ప్రజలకు తెలియక న్యాయం పొందలేకపోతున్నారన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజలు కోర్టులు, పోలీసులు, పోలీస్ స్టేషన్లన్నా ప్రత్యేక భావన ఉందని పేర్కొన్నారు. ప్రజల్లో చైత న్యం, అవగాహన ఉన్నప్పుడే అపోహలు తొలగిపోతాయన్నారు. ప్రభుత్వం తరఫున ఉచిత న్యాయసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. డీఎస్పీ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం పిలుపుమేరకు మండలస్థాయి లో అధికారులు గ్రామగ్రామాన 45 రోజులపాటు లక్ష్యానికి 70 నుంచి 80 శాతం అవగాహన కార్యక్రమాలు చేప ట్టి బాధితులకు ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించారన్నారు. అనంతరం చైల్డ్ లైన్ వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కిరణ్‌కుమా ర్, జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్, పీపీ చంద్రశేఖర్‌రావు, న్యాయవాదులు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని పుష్పలత, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి
విద్యార్థులు మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలని జిల్లా 9వ అదనపు న్యా యమూర్తి బి.శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని మర్రికుంట ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువులో అంకితభా వం, పట్టుదల, సాధించాలనే లక్ష్యం, క్రమ శిక్షణతో ఉన్నతస్థాయికి ఎదుగాలని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ చిన్న వయస్సులో బాలల హ క్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం చేయాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్‌బాబు, న్యాయవాదులు, లోక్ అదాలత్ సిబ్బంది, గురుకుల పాఠశాల ప్రధానాచార్యురాలు శ్రీలేఖ, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.