డీఈవో సిరాజుద్దీన్
గద్వాలటౌన్, నవంబర్ 12 : విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే నాస్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో సిరాజుద్దీన్ తెలిపారు. విద్యా సామర్థ్యం తెలుసుకునేందుకు 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు శుక్రవారం నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే(నాస్) పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 109 పాఠశాలలను ఎంపిక చేశారు. ఎం పిక చేసిన పాఠశాలల నుంచి 3 వతరగతిలో 720మంది, 5వ తరగతిలో 670, 8వ తగరతిలో 1,324, 10వ తరగతిలో 1,642మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేం ద్రాలను డీఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా నిర్వహణ ద్వారా విద్యార్థుల చదువులో, బోధనలో ఉన్న లోపాలను, బోధన పద్ధతులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా లోపాలను సరిచేసి మార్పులు తీసుకొచ్చేందుకు పరీక్షా ఎంతగానో దోహద పడుతుందున్నారు. ఆయన వెంట జిల్లా సెక్టోరియల్ అధికారి ఏస్తేరాణి, హంపయ్య, ఏపీవో శ్రీనివాస్ ఉన్నారు.
విద్యా సామర్థ్యంపై పరీక్షలు
మల్దకల్, నవంబర్ 12 : జాతీయ సాధన సర్వేలో భాగంగా శుక్రవారం విద్యార్థుల విద్యా సామర్థ్యాలపై తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించినట్లు ఎంఈవో కొండా రెడ్డి తెలిపారు. మండలంలోని మల్దకల్, పాల్వాయి, మల్లెందొడ్డి,అమరవాయి, బిజ్వారం గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలలో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. పరీక్షలు రాసేందుకు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల ఎంపికను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశామన్నారు. తరగతికి 33 మంది విద్యార్థుల చొప్పున పరీక్షలకు అనుమతి ఇచ్చామన్నారు.
జాతీయ సాధన పరీక్ష విజయవంతం
అయిజరూరల్ , నవంబర్ 12 : మండలంలోని పదహారు పాఠశాలల్లో 1,149 మంది విద్యార్థులకు శుక్రవారం జాతీయ సాధన పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో సామర్థ్యాన్ని గుర్తించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి మూడేండ్లకు ఒకసారి జాతీయ సాధన పరీక్షను నిర్వహిస్తారు. మండలంలో జరిగిన పరీక్షల్లో మూడో తరగతి నుంచి 90 మంది, ఐదో తరగతి నుంచి 30, ఎనిమిదో తరగతి నుంచి 618 , 10వ తరగతి నుంచి 411 మంది మొత్తం 1,149 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎంఈవో నర్సింహ ఆధ్వర్యంలో 18మంది ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భీమేశ్వర్ రెడ్డి, భీముడు, రజినీకాంత్, సుదర్శన్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొ న్నారు.
అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే
ఎర్రవల్లి చౌరస్తా, నవంబర్ 12 : అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వేలో భాగంగా శుక్రవారం జాతీయ సాధన సర్వే పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో రాజు ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా పదోపటాలంలోని సాయుధచైతన్య పాఠశాల జాతీయ సాధన పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వేలో భాగంగా జాతీయ సాధన సర్వేపరీక్ష నిర్వహించామన్నారు. మండలంలోని సాయుధ చైతన్య, బీచుపల్లి గురుకుల, ఇటిక్యాల గురుకుల, ధర్మవరం జెడ్పీహెచ్ఎస్, సరస్వతీ సీబీఎస్సీ, సరస్వతీ హైస్కుల్ మొత్తం ఆరు పరీక్షాకేంద్రాల్లో జాతీయ సాధన సర్వే పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 354 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి హుస్సేన్, ఎమ్మార్సీ ఖాజా, హెచ్ఎం షాషావలి, హెచ్సీ సురేశ్, తిమ్మప్ప, వెంకటేశ్, జయరామ్, అర్ఫజ్, అనిల్ పాల్గొన్నారు.