ప్రకృతి పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
గట్టు, నవంబర్ 12 : వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి వైద్యసిబ్బందిని ఆదేశించారు. గట్టు, రాయాపురం, ఆలూరులను ఆమె శుక్రవారం సందర్శించారు. స్థానిక పీహెచ్సీలో ఓపీ వార్డు, ల్యాబ్‌లను పరిశీలించా రు. రోగులకు అందుతున్న సేవలపై వాక బు చేశారు. ఓ గర్భిణి వద్ద మాతా, శిశు సంరక్షణ(ఎంసీపీ) కార్డును తీసుకొని నమోదు తీరును పరిశీలించారు. ఓటరు జాబితా ప్రకారం ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలన్నారు. వైద్యసిబ్బంది, ఏఎస్‌ఎంలు, ఆశలు సమన్వయంతో పనిచేస్తే లక్ష్యం కష్టమేమికాదని కలెక్టర్ స్పష్టంచేశారు. బృహత్ పల్లె ప్రకృతివనంలో పెద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నా రు. వనం చుట్టూ విధిగా కంచె ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలు అడిగి తెలుసుకున్నారు. పోషణ లోపం, బరువు తక్కువ ఉన్న చిన్నారుల వివరాలు అడిగి తెలసుకున్నారు. వీరికి అందిస్తున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీలు, ఐసీడీఎస్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జెడ్పీహైస్కూల్‌ను సందర్శించిన ఆమె విద్యార్థుల హాజరు నమోదు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ తిరిగి నమోదైన ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేటట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నా రు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. రాయాపురం, ఆలూరుల్లో నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి చెత్తతో ఎరువులను తయారుచేసి మొక్కలకు అందేవిధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, తాసిల్దార్ అహ్మద్‌ఖాన్, డీపీవో శ్యాంసుందర్, ఎంపీడీవో రాఘవ, సీడీపీవో కమలాదేవి, వైద్యాధికారి రాజసింహ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.