ఆలేరురూరల్, అక్టోబర్10 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఆదివారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉత్సవకమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో..
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని వంగపల్లిలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవికి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో అమ్మవారి మాలధారులు యడపల్లి మహేశ్, ఒగ్గు నవీన్, పృథ్వీరాజ్, భరత్ పాల్గొన్నారు.
అన్నపూర్ణాదేవిగా అమ్మవారు
బొమ్మలరామారం : మండల కేంద్రంలో శివ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆదివారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ రాంపల్లి మహేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొలగాని వెంకటేశ్‌గౌడ్, శివ యూత్ అధ్యక్షుడు కేసారం రవి, సభ్యులు శ్రీకాంత్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణ, గణేశ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత వద్ద మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, భారతి దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పొన్నగాని జహంగీర్‌గౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సోలిపురం అరుణ, నవీన్, అనిల్, గోవర్ధన్, సాయికుమార్ పాల్గొన్నారు.