హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
టీఆర్ఎస్లో 50 మంది బీజేపీ నాయకుల చేరిక
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు10: హుజూరాబాద్ ఉప ఎన్నికలో గులాబీ ప్రభంజనం ఖాయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసే బీజేపీ నాయకులు టీఆర్ఎస్లోకి వస్తున్నారని చెప్పారు. మండలంలోని సింగాపురం గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే సతీశ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు యువకులను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని, కానీ వారు వాస్తవాలను గ్రహించి తిరిగొస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలోయువకులు ఎన్. హరీశ్, అన్వేశ్, రాజు, శ్రీకాంత్, దేవరాజ్, అరవింద్, రాకేశ్, అఖిల్, నరేశ్, శివ, అరవింద్, సాయి, అరుణ్, వెంకటేశ్, గణేశ్, అరవింద్, కుమార్ తదితరులు ఉన్నారు. యువ నాయకుడు ప్రణవ్‌బాబు, సింగిల్ విండో అధ్యక్షుడు సుగుణాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి కిషన్‌రెడ్డి, గ్రామశాఖ అద్యక్షుడు కుమార్, ఉప సర్పంచ్ అశోక్, నాయకులు కేతిరి రాజప్రతాప్‌రెడ్డి, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ కృషి
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 10: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్‌లో మంగళవారం ఆయన వడ్డెరకాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో వడ్డెర కులస్తులకు మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, తదితర పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కాగా, వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నట్లు కాలనీవాసులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచ్ మనోహర్, ఎంపీటీసీ రమేశ్, నాయకులు వొడితల ప్రణవ్ బాబు, కిషన్‌రెడ్డి, రాజప్రతాప్‌రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.