
పేదలకు మెరుగైన సేవలందించడంపై శ్రద్ధ
కాంట్రాక్ట్ పద్ధతిన ప్రత్యేక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్
వైద్యశాలల్లో అధునాతన సౌకర్యాలు
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 8;మారుమూల గ్రామాలు, గిరిజన గూడేల ప్రజలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానల ఏర్పాటుకు చర్యలు చేపడుతుండగా, ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అవసరమైన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్నాళ్లూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక ఇబ్బందులు పడిన నిరుపేదలకు మేలు చేకూరనున్నది.
ప్రభుత్వం వైద్యసేవలను మరింత విస్తృతం చేసేందుకు పల్లె దవాఖానల ద్వారా చర్యలు చేపడుతున్నది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అం దించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నది. అందులో భా గంగానే నిధులు మంజూరు చేస్తూ నూతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రై వేట్ వైద్యశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ముఖ్యంగా ప్రసవాలను ప్రోత్సహించడం, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. వారికి అవసరమైన టీకాలు, మందులు అందించడంతోపాటు ఆరోగ్య సూచనలు, సలహాలు అందిస్తున్నది. ముఖ్యంగా పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్టం చేసేలా హెల్త్ వెల్నెస్ సెంటర్లను (పల్లె దవాఖానలను) ఏర్పాటు చేయనున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెం డు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 108 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్ఎం, ఒక హెల్త్ అసిస్టెంట్, ఆశ కార్యకర్త సేవలు అందిస్తుంటారు. గర్భిణులకు పరీక్షలు, బాలింతల సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, వైద్యశిబిరాల నిర్వహణ, క్షయ, నట్టల నివారణ, కీటక జనిత వ్యాధుల నియంత్రణ, పల్స్ పోలియో తదితర సేవలు అందించాల్సి ఉంటుంది. పీహెచ్సీలకు అనుబంధంగా ఉండే ఆరోగ్య ఉపకేంద్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లో మూడు వేల జనాభాకు ఒకటి, మైదాన ప్రాంతాల్లో ఐదువేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి సేవలు అందిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 26 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇం దుకు సంబంధించి అవసరమైన సిబ్బందిని ఒప్పంద పద్ధతిలో ఎంపిక చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాకు 32 మంజూరు..
రాష్ట్ర ప్రభుత్వం పల్లెలకు, గిరిజన గ్రామాలకు సత్వరం మెరుగైన వైద్యం అందించేందుకు నిర్మల్ జిల్లాకు మొత్తం 32 పల్లె దవాఖానలను మంజూరు చేసింది. నిర్మల్ నియోజకవర్గంలో 10, ఖానాపూర్ నియోజకవర్గంలో 11, ముథోల్ నియోజకవర్గంలో 11 దవాఖానలను ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే జి ల్లాలో మొత్తం 19 మండలాలుండగా..17 హె ల్త్ సెంటర్లు ఉన్నారు. 106 సబ్ సెంటర్లున్నా యి. కొత్తగా 32 పల్లె దవాఖానలు మంజూరయ్యాయి.వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై వైద్యశాఖ అధికారులు ఇప్పటికే సర్వేను పూర్తి చేశారు. పల్లె దవాఖానల ఫైనల్ జాబితాను ఎంబీబీఎస్ వైద్యుల నియామకం పూర్తయిన తర్వాత ప్రకటించనున్నారు.
24 గంటలు గ్రామాల్లో వైద్య సేవలు..
మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలో ఆలస్యమవుతున్నది. దీంతో ప్రాణాపాయ స్థితిలో మండల కేంద్ర దవాఖానలకు వచ్చి వైద్యం చేసుకోవాలంటే జాప్యం ఏర్పడుతున్నది. దీంతో క్షణాల వ్యవధిలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇ లాంటి ఘటనలు జరుగుకుండా రాష్ట్ర ప్రభు త్వం పల్లె దవాఖానలను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పుతున్నది. దీంతో స్థానిక రోగులకు 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండనుండడంతో రోగులకు ఇబ్బందులు తొలగనున్నాయి.
వైద్యుల నియామకానికి నోటిఫికేషన్..
పల్లె దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంబీబీఎస్ వైద్యుల నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ నిర్మల్ జిల్లాలో గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వైద్యులు ఈనెల 18వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధన్రాజ్ సూచించారు. పల్లె వాసులకు నాణ్యమైన ఉచిత వైద్యం ఉన్న చోటనే అందనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తూనే పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ వైద్యులను నియమించనుండడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
దవాఖానల ఏర్పాటు మంచిదే..
మారుమూల గ్రా మాల ప్రజల ఇబ్బందుల ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ పల్లెల్లో దవాఖానలను ఏర్పాటు చేయడం మం చి నిర్ణయమే.. ఏ చిన్న రోగమొచ్చినా మూ రుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లాలం టే ఇబ్బందికరమే. దీన్ని దృష్టి లో ఉంచుకొని పల్లె దవాఖానల ఏర్పాటు హర్షణీయం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనుండడం శుభపరిణామం.
సద్వినియోగం చేసుకోవాలి..
గ్రామీణ ప్రాంత ప్ర జల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. నిర్మల్ జిల్లాకు 32 పల్లె దవాఖానలు మంజూరయ్యాయి. వాటిని ఎక్కడెక్కడ ఏ ర్పాటు చేయాలో జాబితాను సిద్ధం చేశారు. తుది జాబితాను సిద్ధం చేస్తున్న ఎంబీబీఎస్ వై ద్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. వైద్య పో స్టుల భర్తీ అనంతరం పల్లె దవాఖాన జాబితా ను వెల్లడిస్తాం. ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతున్నది. ప్రతి రోగి ప్రభుత్వ దవాఖానను సద్వినియోగం చేసుకోవాలి.