
కారేపల్లి, నవంబర్ 7 : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) వరమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని తొమ్మిది మందికి రూ.3,15,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే స్వయంగా వారింటికెళ్లి అందజేశారు. మండలంలోని సూర్యాతండాకు చెందిన జర్పల శాంతికి రూ.31,500, రేలకాయలపల్లికి చెందిన బానోత్ తారాచంద్‌కు రూ.60 వేలు, పేరుపల్లికి చెందిన పోలోజు వెంకటాచారికి రూ.44,500, కారేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ సలీంకు రూ.20,500, గిద్దెవారిగూడేనికి చెందిన గుగులోత్ మోహన్‌రావుకు రూ.28,500, బీక్యాతండాకు చెందిన బానోత్ ఈర్యాకు రూ.22,500, భరత్‌నగర్ కాలనీకి చెందిన తలారి భాగ్యమ్మకు రూ.60 వేలు, భాగ్యనగర్‌తండాకు చెందిన భూక్య దాస్మకు రూ.27 వేలు, భూక్య విశాల్‌కు రూ.21 వేలు, మంజూరు కాగా ఎమ్మెల్యే వారి ఇండ్లకు వెళ్లి చెక్కులు అందజేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలన్నీ లబ్ధిదారుల ఇంటికే చేరుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత దేవాలయ చైర్మన్ మల్లేల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోత్ శ్రీనునాయక్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ధరావత్ మంగీలాల్, సర్పంచులు మాలోత్ కిశోర్, బానోత్ బూలీ, అజ్మీర అరుణ, నాగేశ్వరరావు, కుమార్, ఆదినారాయణ, జర్పల శాంతిహచ్చు, భూక్యా రమణ, బానోత్ సక్రాం, ఎంపీటీసీలు పాండ్యానాయక్, పెద్దబోయిన ఉమాశంకర్, శంకర్, అనీఫ్, నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, అడ్డగోడ ఐలయ్య, పప్పుల నిర్మల, షఫీ, భాస్కర్, కోటి పాల్గొన్నారు.