జడ్పీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
నిర్మల్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం
వరద ప్రాంతాల్లో అధికారుల సేవలు అభినందనీయం
డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్‌కు సంతాపం
నిర్మల్ టౌన్, ఆగస్టు 7: జిల్లాలో వరద బాధితులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్‌లో జిల్లా పరిషత్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన డీసీసీబీ చైర్మన్ నాందేవ్, సర్పంచ్ కీర్‌త్తి రెడ్డికి నివాళులర్పించారు. డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రఘునందన్‌రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాలో సుమారు రూ. 150కోట్ల మేరకు నష్టం వా టిల్లిందని ప్రభుత్వం వేగంగా నష్ట నివారణ చర్యలు చేపట్టిందని వారు పేర్కొన్నారు. అనంతరం ఎజెండాలోని అంశాలపై చర్చించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణిత వివరించారు. జిల్లాలో సిగ్నల్స్ సమస్యతో పేద విద్యార్థులు నష్టపోతున్నారని జడ్పీటీసీ సభ్యులు జానుభాయి, జీవన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. రూ. 17 కోట్ల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారి వివరించగా.. పరిహా రం కింద డబ్బులు చెల్లించేలా తీర్మాణం చేయాలని పలువు రు కోరారు. కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకొని ని ర్మల్ జిల్లాలో వరద నష్టం కింద రూ. 146 కోట్లు మంజూరు చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో నివేదిక పంపామని చెప్పారు. జిల్లాలో అటవీశాఖ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ గజ్జారాం కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
హరితహారంలో ఇక నుంచి తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటిస్తామని డీఎఫ్‌వో సిద్దార్థ విక్రమ్ హామీనిచ్చారు. జిల్లాలో కొత్త రేషన్‌కార్డుదారులకు బియ్యం అందిస్తున్నామని డీఎస్వో కిరణ్‌కుమార్ వివరించారు. పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో వ్యాధి నివారణ చర్యలను చేపట్టినట్లు పశు సంవర్ధకశాఖ అధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ని ర్మల్ జిల్లాలో సుమారు 30 చెరువులు దెబ్బతిన్నాయని పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఈఈ రామారావు తెలిపారు. తెగిపోయిన చెరువులకు వెంటనే మరమ్మతులు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కోరారు. డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ రఘునందన్రె డ్డి మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణాలను అందిస్తామని వివరించారు. ఎస్సారెస్పీ కాలువలో కూడుకపోయిన మట్టిని తొలగించాలని జడ్పీటీసీ ఓస రాజేశ్వర్ కోరారు. కడెం దస్తురాబాద్ మండలంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అలెగ్జాండర్, రఫీ అహ్మద్ పేర్కొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
ఇటీవల కురిసిన వర్షాలకు పల్సి రంగారావు ప్రాజెక్టులో ముంపునకు గురైన గుండెగాం బాధితులతో పాటు వరదలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి అల్లోల సహకారంతో నిర్మల్ జిల్లాలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రికి విన్నవించడంతో ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సీజన్లో చెరువులు తెగిపోవడంతో పంట నష్టపోకుండా తాత్కాలిక పనులు వెంటనే ప్రా రంభించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు.
అధికారులపై ప్రశంసల జల్లు…
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణాలను, ఆస్తినష్టాన్ని నివారించి పునరుద్ధరణ చర్యలను వేగంగా చేపట్టిన అధికారులను జడ్పీ సమావేశంలో కలెక్టర్ ముషార ఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ ప్రాంతంలో మూడు కాలనీలు నీటమునిగిపోవడంతో మత్స్యశాఖ అధికారులు తెప్పల సాయం తో 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన దేవేందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో 1700 విద్యుత్ స్తంభాలు, 300 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరద న ష్టంలో కొట్టుకపోతే వారం రోజుల్లో పునరుద్ధ్దరణ చర్యలు చేపట్టిన విద్యుత్‌శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. సీజన్ వ్యాధులు రాకుండా వైద్యశాఖ, గ్రామాల్లో పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్న పంచాయతీరాజ్‌శాఖ, పంట నష్టం వివరాలు సేకరించిన వ్యవసాయశాఖను కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, శిక్షణ కలెక్టర్ కదిరావణ్, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, వైస్ చైర్మన్ సాగరబాయి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లింగయ్య, జిల్లా అధికారు లు సుశీల్‌కుమార్, రమేశ్‌కుమార్, వెంకటేశ్వర్రావు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాస్‌గౌడ్, రాజలింగం, అంజిప్రసాద్, హన్మాండ్లు, కిరణ్‌బాబు, మధుసూదన్‌రావు, ముత్తన్న, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.