యాదాద్రి, అక్టోబర్ 6 : ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం 15 వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథిగా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై సైన్యానికి దిశా నిర్దేశం చేస్తారని ఆయన పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం సాధువెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు తిప్పారపు మహేశ్ ఆధ్వర్యంలో పాల సంఘం చైర్మన్ కామండ్ల సిద్దిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డొంకెన లింగయ్య, యింజ బక్కయ్య, యువజన విభాగం నాయకులు మిసా హరిబాబు, మ్యాక భాస్కర్, మిసా మల్లేశ్, కృష్ణా, సుంకె అంజయ్య, మ్యాక అజయ్‌తో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముక్యర్ల సతీశ్‌యాదవ్, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, ఆవుల మమత, సురేందర్, నాయకులు కసావు శ్రీనివాస్, మిట్ట వెంకటయ్య, పాపట్ల నరహరి పాల్గొన్నారు.