మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చౌటుప్పల్, అక్టోబర్ 6 : పేదలకు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నలుగురికి, లింగోజీగూడెంలో ఒకరికి సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు కాగా.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్‌యాదవ్, ముటుకుల్లోజు దయాకరాచారి, సుర్కంటి మహేందర్‌రెడ్డి, కనకారెడ్డి, వీరమళ్ల సత్తయ్యగౌడ్ పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండల లబ్ధిదారులకు..
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని మల్లారెడ్డిగూడేనికి చెందిన ఇద్దరు, పుట్టపాకకు చెందిన ఒకరికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను కూసుకుంట్ల అందించారు. టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఆడెపు పరదేశి, జిల్లా నాయకులు దేప విప్లవరెడ్డి, టీఆర్ఎస్వీ మునుగోడు అధ్యక్షుడు నలపరాజు రమేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు సుక్క గాలయ్య, ఆడెపు సురేశ్ పాల్గొన్నారు.