ఎంపీపీ, జడ్పీటీసీ
రామన్నపేట, అక్టోబర్6 : రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్ అన్నారు. బుధవారం మం డలంలోని వెల్లంకి, సిరిపురం, నీర్నెముల, నిదాన్‌పల్లి, లక్ష్మాపురం, మునిపంపుల గ్రామాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి మాట్లాడారు. వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సర్పంచులు ఎడ్ల మహేందర్‌రెడ్డి, గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మినర్సు, ఉప్పు ప్రకాశ్, ముత్యాల సుజాత, యాదాసు కవిత, ఎంపీటీసీలు బడుగు రమేశ్, గాదె పారిజాత, మాడూరి జ్యోతి, గోగు పద్మ, ఏనుగు పుష్పలత, ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
చౌటుప్పల్ : ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. లక్కారంలో బతుకమ్మ చీరెలను ఆయన పంపణీ చేసి మాట్లాడారు. తాసీల్దార్ గిరిధర్, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు కొయ్యడ సైదులుగౌడ్, కాసర్ల మంజుల, నాయకులు కానుగు బాలరాజు, గుండబోయిన అంజయ్యయాదవ్ పాల్గొన్నారు.
నెమిలకాల్వ, మల్లేపల్లిలో..
వలిగొండ : మండలంలోని నెమిలకాల్వ గ్రామంలో బతుకమ్మ చీరెలను ఎంపీపీ నూతి రమేశ్ బుధవారం అందజేశారు. మండలంలోని మల్లేపల్లిలో సర్పంచ్ బోళ్ల లలిత కూడా బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంతో భాగంగా గ్రామంలో వీధులను శుభ్రపరిచి, ప్లాస్టిక్ కవర్లను సేకరించారు. సర్పంచ్ వంగాల భిక్షపతి, ఉప సర్పంచులు మైసోళ్ల మత్స్యగిరి, లింగస్వామి, ఎంపీటీసీ పల్లెర్ల భాగ్యమ్మ, రేగు కొమురయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పోచంపల్లిలో..
భూదాన్ పోచంపల్లి: పట్టణంలోని 8వ వార్డులో కౌన్సిలర్ సామల మల్లారెడ్డి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. రేషన్ డీలర్ చెరుకు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లిగుండ్ల తండాలో..
బొమ్మలరామారం : పిల్లిగుండ్ల తండాలో సర్పంచ్ మోతీమున్యానాయక్ బుధవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఉపసర్పంచ్ బాల్సింగ్, ఎంపీటీసీ అనితాకావ్య, ఈశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు లింగా నాయక్, కిషన్ నాయక్, గణేశ్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
సారగండ్లగూడెంలో..
ఆత్మకూరు(ఎం) : సారగండ్లగూడెంలో సర్పంచ్ కల్వల రాములమ్మ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ గోవిందమ్మ, రేషన్ డీలర్ మల్లారెడ్డి, వార్డు సభ్యులు మోహన్‌రెడ్డి, రేణుక, సత్యనారాయణతోపాటు బాలరాజు, రామచంద్రారెడ్డి, అంజయ్య, కిష్టమ్మ పాల్గొన్నారు.
చోక్లా, బద్దుతండాల్లో..
తుర్కపల్లి : మండలంలోని చోక్లాతండా, బద్దుతండాలో బతుకమ్మ చీరెలను సర్పంచులు సరిత, సురేశ్‌నాయక్, ఎంపీటీసీ మోహన్‌బాబు పంపిణీ చేశారు.
గుండాల : పాచిల్ల గ్రామంలో బతుకమ్మ చీరెలను సర్పంచ్ పందుల రేఖ, ఎంపీటీసీ కుంచాల సుశీల పంపిణీ చేశారు. ఉపసర్పంచ్ అత్తి భాస్కర్, వార్డు సభ్యులు కనకలక్షి, నాగలక్ష్మి, స్వామి పాల్గొన్నారు.
సర్కారు కానుక బతుకమ్మ చీరె
చౌటుప్పల్ రూరల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరెలు పంపిణీ చేస్తున్నదని ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, సర్పంచులు మునగాల ప్రభాకర్ రెడ్డి, బాతరాజు సత్యం, కాయితి రమేశ్‌గౌడ్, బచ్చ రామకృష్ణ, చౌట వేణుగోపాల్ గౌడ్, పెద్టిటి హేమలత, ముద్దం సుమిత్ర, ఆకుల సునీత, వాకిటి భూలక్ష్మి, బక్క స్వప్న, బూర్గు చంద్రకళ, మిర్యాల పారిజాత పాల్గొన్నారు.