పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
ప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణ
ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు
ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు..
100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు
యాలాల, అక్టోబర్6: పల్లెప్రగతి కార్యక్రమంతో ముద్దాయిపేట్ దశ మారింది. రెండేండ్లలో ఊహించని స్థాయి లో అభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. అద్దాల్లాంటి సీసీ రోడ్లతోపాటు రాత్రివేళలో జిగేల్మనే లైట్లు ముద్దాయిపేట్కు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు గ్రామంలోకి సాదర స్వాగతం పలుకుతున్నా యి. వైకుంఠధామం, డంపింగ్యార్డు అందుబాటులోకి వచ్చాయి. స్థానికుల ఇండ్ల నుంచి పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ తడి, పొడి చెత్తను సేకరించి పంచాయతీ ట్రాక్ట ర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అం దుతున్నది. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి వినియోగిస్తుండటంతో ముద్దాయిపేట్ స్వచ్ఛ గ్రామంగా మారింది. ప్రభుత్వ చేయూతతోపాటు ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. పల్లెప్రగతిలో భాగంగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చడం, పాడుబడ్డ బావులను పూడ్చడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ మురుగు కాల్వలను శుభ్రం చేయడంతోపాటు దోమల నివారణకు రసాయనాలను చల్లుతున్నారు. పల్లె ప్రకృతివనంలో వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. రెండేండ్ల కాలంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. వివిధ రకాల నిధులతో గ్రామంలోని కాలనీల్లో సీసీ రోడ్లను నిర్మించారు.
గ్రామ జనాభా 1,222 మంది..
గ్రామంలో 1222 మంది జనాభా ఉంది. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.3లక్షలతో డంపింగ్ యా ర్డు (కంపోస్టుయార్డు), రూ.2లక్షలతో పల్లెప్రకృతివనం పనులు చేపట్టారు. అదేవిధంగా నర్సరీలో వివిధ రకాల 11వేల మొక్కలు పెంచుతున్నారు. 30 గుం టల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో 20 రకాలకు చెందిన 1200 వందల మొక్కలను పెంచుతున్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
పారిశుధ్యంలో తనదైన ముద్ర
పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. స్థానికులు చెత్తను వేరు చేసేందుకు తడి, పొడి రెండు చెత్త బుట్టలను అందజేశారు. సీజన్ వ్యాధులు సోకకుండా కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైట్ ద్రావణాన్ని సర్పంచ్ పిచికారీ చేయిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ది. పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెకు కొత్త అందం వచ్చింది. ప్రజాప్రతినిధు లు, అధికారులు, స్థానికుల సహకారం తో గ్రామాన్ని మరింత ఆదర్శంగా తీర్చిది ద్దుతా. ప్రభుత్వ నిధులతో ఇప్పటికే గ్రామంలో అనేక అభివృద్ధి పనులను పూర్తి చేశా. సీసీ రోడ్ల ఏర్పాటుతో గ్రామం పరిశుభ్రంగా మా రింది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం.
-కృష్ణయ్యగౌడ్, ముద్దాయిపేట్ సర్పంచ్