
నిమ్జ్‌లో ట్రైటాన్ పరిశ్రమ ప్రతినిధుల పర్యటన
ఝరాసంగం, అక్టోబర్ 6: సంగారెడ్డి జిల్లా ఝరాసగం మండలం బర్దీపూర్, ఎల్గొయి గ్రామాల శివారులో బుధవారం ట్రైటాన్ పరిశ్రమ ప్రతినిధులు పర్యటించారు. ఆ పరిశ్రమ ప్రతినిధి హిమాన్ష్ పాటిల్‌తో పాటు రాష్ట్ర పరిశ్రమలశాఖ, (టీఎస్ఐఐసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్‌నర్సింహారెడ్డి, ఇంజినీరింగ్ అధికారి శ్యామ్‌సుందర్ వచ్చి, స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఏరియల్ సర్వే చేశారు. పరిశ్రమ నిర్మాణానికి 200 ఎకరాలు అవసరం కాగా, ప్రభుత్వం కేటాయించినట్లు నిమ్జ్ అధికారులు తెలిపారు. కాగా, జహీరాబాద్ డీఎస్పీ శంకర్‌రాజ్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్ తారాసింగ్ వారివెంట ఉన్నారు.