ఎంపీపీ కిచ్చారెడ్డి
పలు గ్రామాల్లో చీరెలు పంపిణీ
వనపర్తి రూరల్, అక్టోబర్ 6 : తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరెలను అందిస్తుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కాశీంనగర్, అచ్యుతాపురం గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ కిచ్చారెడ్డి హాజరై గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు రమాదేవి శారదానాయుడు, శేఖర్, వెంకటయ్య, వార్డు సభ్యులు మల్లేశ్, దేవేందర్, తిరుపతయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పాపిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాసులు, అంగన్వాడీ టీచర్ లలితమ్మ, ఆశ వర్కర్ ఆలివేల, వార్డు సభ్యులు వినోద్, నీలయ్య, సుజాత, రాములమ్మ, మహిళా సంఘం సభ్యురాలు చిట్టెమ్మ, రైతు సమితి సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పాల్గొన్నారు.
పెద్దమందడి మండలంలో..
పెద్దమందడి, అక్టోబర్ 6 : మండలంలోని చిన్నమందడి, అమ్మపల్లి గ్రామాల్లో ఎంపీపీ తూడి మేఘారెడ్డి, జెడ్పీటీసీ ర ఘుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రఘుప్రసాద్ మహిళలకు బతుక మ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ చీరెలను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రె డ్డి, సింగిల్‌విండో డైరెక్టర్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నాగేంద్రంయాదవ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, సురేశ్‌గౌడ్, మధుసూదన్‌గౌడ్, బాలరాజుయాదవ్, నరేశ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బాలు, అర్జునయ్య పాల్గొన్నారు.
అమరచింత మండలంలో..
అమరచింత, అక్టోబర్ 6 : మండలంలోని అన్ని గ్రామా ల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కొనసాగుతుందని తాసిల్దార్ సిందూజ తెలిపారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 8,136కు గానూ ఇప్పటి వరకు 4,500 చీరెలను పంపిణీ చేశామని ఆమె పేర్కొన్నారు.
మదనాపురం మండలంలో..
మదనాపురం, అక్టోబర్ 6 : మండలంలోని దుప్పల్లి, గో పన్పేట, కర్వెన, భౌసింగ్తండాల్లో ఎంపీపీ పద్మావతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, మహిళా అధ్యక్షురాలు అనురాధ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు చీరెల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆడపడుచు కానుక బతుకమ్మ చీరెల పంపిణీ అద్భుతంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కృష్ణయ్య, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు కురుమూర్తి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కురుమయ్య, సర్పంచులు శివశంకర్, ఆంజనేయులు, శ్రీనివాసులు, ఎంపీటీసీ శాంతమ్మ పాల్గొన్నారు.
చిన్నంబావి మండలంలో..
చిన్నంబావి, అక్టోబర్ 6 : మండలంలోని పెద్దమరూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ఆడపచులకు ఎంపీపీ సోమేశ్వరమ్మ, పెద్దమరూరు సర్పంచ్ గోవిందుశ్రీధర్రెడ్డి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బీసన్న, కార్యదర్శి రమేశ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, భగవంతారెడ్డి, సుధాకర్, డీలర్ మోహన్, పెద్దరంగస్వామి, నాగేశ్వర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సుగ్రీవుడు పాల్గొన్నారు.