మంచిర్యాలటౌన్, ఆగస్టు 6: పట్టణంలోని ఐబీ ఆవరణలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు దుర్గం రాజేశ్, కౌన్సిలర్లు హరికృష్ణ, నాయకులు నగేశ్, ఎర్రం తిరుపతి, కడమండ రమేశ్, జెట్టి చరణ్‌దాస్, జూపాక సుధీర్, బైరం సతీశ్, ఈద శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలం నర్సింగాపూర్‌లో..
హాజీపూర్, ఆగస్టు 6 : మండలంలోని నర్సింగాపూర్‌లో దళితులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు సీపె ల్లి మొగిళి, దళిత సంఘాల నాయకులు రేగుంట లింగయ్య, రెడ్డిమల్ల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలం సూపాకా గ్రామంలో..
కోటపల్లి, ఆగస్టు 6 : మండలంలోని సూపాక గ్రామంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అజ్గర్ మొహియొద్దీన్ ఆధ్వర్యంలో దళితులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జ డ్పీ కోఆప్షన్ సభ్యుడు మాట్లాడుతూ దళితుల సాధికారతకు సీఎం కృషి చేస్తున్నాడన్నారు. సర్పంచ్‌లు కాశెట్టి సతీశ్, గట్టు లక్ష్మణ్ గౌడ్, ఎంపీటీసీ మారిశెట్టి తిరుపతి, మం డల కోఆప్షన్ సభ్యుడు గరీబ్ఖాన్, ఏఎంసీ డైరెక్టర్ దుర్గం వెంకటస్వామి, దళిత సంఘం నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.